SAKSHITHA NEWS

అత్యధిక ఉత్తీర్ణత సాధించాలి:ఇంటర్మీడియట్ జిల్లా విద్యాశాఖాధికారి యం హృదయ రాజు

గద్వాల – విద్యార్థులు చక్కగా చదివి అత్యధిక ఉత్తీర్ణత సాధించాలని ఇంటర్మీడియట్ జిల్లా విద్యాశాఖాధికారి యం హృదయ రాజు పేర్కొన్నారు. గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ (కో – ఎడ్యుకేషన్) కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.కళాశాలలో గల పలు రికార్డులను చూసి అనంతరం తరగతి గదులకు వెళ్లి సిలబస్ గురించి వివరించారు.సందర్బంగా అయన మాట్లాడుతూ…విద్యార్థులు ప్రతిరోజు కళాశాలకు తప్పకుండా రావాలని ప్రభుత్వ కళాశాలలో ఉచిత పాఠ్యపుస్తకాలను కష్టపడి చదివితే ఉన్నత శిఖరాల అధిరోహించవచ్చని అన్నారు.

ఈ విద్యార్థికి ఇంటర్మీడియట్ దశ చాలా కీలకమైనది అని విద్యార్థులు అందరూ పరీక్షల సమయం ఆసన్నమైనందున ఇప్పటి నుండే ప్రణాళిక బద్దంగా చదివి తల్లిదండ్రులకు కళాశాలకు అధ్యాపకులకు మంచి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ప్రతి ఒక్కరూ అందుకు కృషి చేయాలని ప్రిన్సిపాల్ జి వీరన్న మరియు అధ్యాపకులకు విద్యార్థులకు ఎప్పుడు అందుబాటులో ఉండాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

WhatsApp Image 2023 12 15 at 1.45.25 PM

SAKSHITHA NEWS