ఆంధ్రసారస్వతా పరిషత్ గోడపత్రిక ఆవిష్కరణ లో మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు….
జనవరి 5,6,7 తేదీలలో రాజమండ్రి లో నిర్వహణ
తెలుగు వెలుగులు విశ్వవ్యాప్తం. కావాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖా మంత్రి డాక్టర్ సీదిరి. అప్పలరాజు ఆకాంక్షించారు. ఆంధ్ర సారస్వతా పరిషత్, చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో రాజరాజ నరేంద్రుల పట్టాభిషేక సహస్రబ్ది నీరాజనం గా డాక్టర్ గజల్ శ్రీనివాస్ అధ్యక్షతన రాజమండ్రిలో జనవరి 5,6,7 తేదిలో నిర్వహించనున్న రెండవ అంతర్జాతీయ తెలుగమహాసభల గోడ పత్రికను పలాస క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా డాక్టర్ సీదిరి మాట్లాడుతూ తెలుగు జాతి సాహితీ, సాoస్కృతిక ఆత్మ గౌరవం వైభవం విశ్వవ్యాప్తం కావాలని ఆకాంక్షించారు. తెలుగు భాషలో సాహితీ ప్రక్రియలపై, తెలుగు వైభవాన్ని చాటిచెప్పే ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నందుకు నిర్వాహకులు గజల్ శ్రీనివాస్ ను, చైతన్య రాజు గారిని అభినందించారు.
ఈ మహాసభలను జయప్రదం చెయ్యడం తెలుగు వారందరి భాద్యత అని అన్నారు. శ్రీకాకుళం ఆంధ్ర సారస్వత పరిషత్ సంచాలకులు లఖినాన. రవికుమార్ మంత్రి సీదిరికి ఆహ్వానపత్రిక అందచేసారు. ఆ మూడు రోజులు నిర్వహించ నున్న కార్యక్రమాలు గురుంచి వివరించారు. ఈ మహాసభల్లో నిర్వహణ లో బాగస్వామ్యం అవుతున్న శ్రీకాకుళం శాఖ కార్యక్రమవర్గాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమం లోజిల్లా సారస్వతా పరిషత్ కార్యవర్గం డాక్టర్ గంజి ఏజ్రా, సంపతి రావు సౌమ్య ఎల్ వెంకటాచలం, కట్టాపార్ద సారధి పైడి రాము, అనిల్ రాజ్ ఎపీటీ ఏఫ్ యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘాల నాయకులు బల్ల సుభాష్ బాబు కంచరాన రమేష్ పలాస సారస్వత కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.