ప్రజాస్వామ్య బద్ధంగా పాలన సాగించడానికి సీపీఐ కృషి
కలవేన శంకర్
సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు
తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 30న జరిగిన ఎన్నికలు, డిసెంబర్ 3న వెలుబడిన ఫలితాలు ప్రజాస్వామ్యంలో అహంకార వైఖరిని ప్రజలు అంగీకరించరనే విషయాన్ని వెల్లడించే విధంగా ఉన్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్ అన్నారు. సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథులుగా కలవేన శంకర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో విలువలతో కూడిన పాలన ముఖ్యం అని, ప్రజా గొంతుకగా చట్ట సభల్లో సిపిఐ తన గళాన్ని వినిపించేందుకు ప్రజలు అవకాశం కల్పించడం ఆనందంగా ఉందన్నారు. మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో సిపిఐ మిత్రపక్ష కాంగ్రెస్ అభ్యర్ధులను ప్రజలు అధిక మెజారిటీతో గెలిపించడం, కొత్తగూడెంలో సిపిఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు గెలుపుకు సహకరించిన ప్రజలకు పార్టీ తరుపున కృతజ్ఞతలు తెలిపారు. నియంతలా, నిరంకుశంగా పాలన సాగించిన పాలకులకు ఈ ఎన్నికలు గుణపాఠాన్ని నేర్పాయని, ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తే సహించేది లేదని, ఆత్మగౌరం కోసం, ఆత్మగౌరవ పరిపాలన కోసం తెలంగాణ ప్రజలు ఎప్పుడు పోరాటంలో ముందుంటారని తెలిపారు. ఎర్ర జెండా పార్టీలు ఎప్పుడు అధికారం కోసం తాపత్రయపడవని, ప్రజల సమస్యలపై, ప్రజా సంక్షేమంపై పోరాటాలు సాగిస్తాయని అన్నారు. ఓడితే గెలువచ్చని, పడితే లేవచ్చని, కానీ లాలుచీపడితే చరిత్ర క్షమించదని, అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల కోసం కాకుండా ప్రజలకు సుపరిపాలన అందాలనే లక్ష్యంతో ఒక్క సీటుకు కట్టుబడి రాష్ట్రంలోని 119 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలువుకు పార్టీ శ్రేణులు కృషి చేశాయని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ప్రజల ఆకాంక్ష నెరవేర్చే దిశగా పాలన అందించడానికి తమ వంతు పోరాటాలు వుంటాయి అని, నేడు ఏర్పడిన ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలకు పాలన అనిదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో CPI జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, AITUC జిల్లా కార్యదర్శి మేకల దాసు,జిల్లా కార్యవర్గ సభ్యులు రేగుంట చేంద్రశేఖర్, జోగుల మల్లయ్య,ఖలింధర్ అలి ఖాన్,జిల్లా సమితి సభ్యులు మిట్టపల్లి పౌల్, మీర్యాల రాజేశ్వరరావు,మండల కార్యదర్శులు,మేదరి దేవవరం,దేవి పొచన్న,బొంతల లక్ష్మినారాయణ, పెర్క రాజేశం,జిల్లా సమితి సభ్యులు దొడ్డిపట్ల రవీందర్,చాడ మహేందర్ రెడ్డి,శంకరయ్య,కేతిరెడ్డి రమణ రెడ్డి,రాజేశం,కోడి వెంకటేశం మరియు నర్సయ్య లు పాల్గొన్నారు.