బోనాలతో ఎమ్మెల్యే కేపీ వివేకానంద కి ఘన స్వాగతం పలికిన మహిళలు, నాయకులు…
*సంక్షేమాన్ని, అభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు బిఆర్ఎస్ పార్టీని మరోమారు ఆశీర్వదించాలి : ఎమ్మెల్యే కేపీ వివేకానంద ….
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం దుందిగల్ మున్సిపాలిటీ పరిధి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కెపి వివేకానంద ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహిళలు తెలంగాణ బోనాలతో ఎమ్మెల్యే కేపీ వివేకానంద కి ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం హైదరాబాద్ నగరం తో పాటు శివారు ప్రాంతాలు వేగంగా విస్తరించాయన్నారు. అన్ని వర్గాల ప్రజల నివాసానికి ఆమోద్యయోగ్యమైన ప్రాంతంగా ఉండడంతో హైదరాబాదు నగరం నేడు వేగంగా విస్తరిస్తుందన్నారు. అందుకు తగ్గట్టుగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ మున్సిపాలిటీలో మౌలిక వసతులు కల్పిస్తూ ఎంతో అభివృద్ధి చేశామని రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఈ అభివృద్ధిని కొనసాగించేందుకు నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో మూడవ నెంబర్ పై ఓటు వేసి భారీ మెజార్టీతో హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్లు, వార్డు అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.