పెద్ద సంఖ్యలో Mobi Track Kakinada Police సేవలను వినియోగించుకుంటున్న ప్రజలు.
జిల్లా పోలీసుచే రికవరీ చేయబడ్డ 235 సెల్ ఫోన్ లు బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పి ఎస్.సతీష్ కుమార్, IPS.
దొంగలించబడ్డ తమ విలువైన ఫోన్ లను రికవరీ చేసి ఇవ్వడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన బాధితులు.
కాకినాడ జిల్లాలో గత కొంత కాలంగా మిస్ అయిన/దొంగిలించ బడిన మొబైల్ ఫోన్ ల కొరకు జిల్లా ఎస్పి ఎస్.సతీష్ కుమార్, IPS., ప్రత్యేక పర్యవేక్షణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి “Mobi Track Kakinada Police” సేవల ద్వారా పోగొట్టుకున్న సెల్ ఫోన్ లను రికవరీ చేసి బాధితులకు అందజేయడం జరిగింది.
ఈ పరంపర లో భాగంగా కాకినాడ ఐ.టి. కోర్ బృందం, జిల్లాలోని పోలీస్ స్టేషన్ ల క్రైమ్ బృందాలు సంయుక్త కృషితో తక్కువ కాలంలోనే ప్రజలు పోగొట్టుకున్న సుమారు 40 లక్షల రూపాయల విలువ గల 235 ఫోన్ లను రికవరీ చేయడం జరిగింది.
కాకినాడ జిల్లా ఎస్పి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రికవరీ చేయబడిన 275 సెల్ ఫోన్ లను సంభందిత ఫిర్యాదిదారులకు జిల్లా ఎస్పి ఎస్.సతీష్ కుమార్, IPS., చేతుల మీదుగా అందజేయడం జరిగింది. దొంగలించబడ్డ తమ విలువైన ఫోన్లను రికవరీ చేసి ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని ఎస్పి కి జిల్లా పోలీసు యంత్రాంగానికి బాధితులు తమ కృతజ్ఞతలు తెలియజేసారు. “Mobi Track Kakinada Police” సేవలను ప్రారంభించినాటి నుండి మొదటి విడత 90, రెండవ విడత 249, మూడవ విడత 231, నాల్గవ విడత 275, ప్రస్తుతం 235 మొత్తంగా 1080 సెల్ ఫోన్ లను రికవరీ చేసి పోగొట్టుకున్న బాధితులకు ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ ఈ సెల్ ఫోన్ ల రికవరీ విషయంలో విశేషమైన కృషి చేసిన ఐ.టి. కోర్ టీం – ఇన్స్పెక్టర్ పి.శ్రీనివాసరావు, ఎస్.ఐ. డి.రామక్రిష్ణ, ఐ.టి. కోర్ బృంద సభ్యులు మరియు ఆయా పోలీస్ స్టేషన్ ల ఎస్.ఐ. లు, సి.ఐ. లు, డి.ఎస్.పి. లు, సంభందిత సిబ్బంది అందరిని అభినందించడం జరిగింది.
మిస్ అయిన లేదా దొంగలించబడ్డ తమ ఫోన్ లను తిరిగి పొందడం కోసం జిల్లా ప్రజలు ఈ “Mobi Track Kakinada Police” సేవలను ఉపయోగించుకోవడానికి “94906 17852” నంబర్ వాట్సప్ కు హాయ్ లేదా హలో అని ఏదైనా చిన్న మెసేజ్ ఇవ్వాలని, అలా మెసేజ్ ఇచ్చిన తర్వాత వచ్చిన లింక్ నందు వివరాలు నమోదు చేయడం ద్వారా ఈ సేవలను ఉపయోగించుకోవాలని ఎస్. పి. మరొక్క సారి అందరికీ చెప్పడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన CEIR వెబ్సైటు https://www.ceir.gov.in లో కూడా దొంగలించబడ్డ ఫోన్ ల కొరకు ఫిర్యాదు నమోదు చేసుకోగలరని తెలియచేయడం జరిగింది.
ఈ పాత్రికేయ సమావేశంలో జిల్లా ఎస్పి ఎస్.సతీష్ కుమార్, IPS., తో పాటుగా జిల్లా అడిషనల్ ఎస్పి అడ్మిన్ పి.శ్రీనివాస్, కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ CH. రామ కోటేశ్వరరావు, ఐ.టి. కోర్ ఇన్స్పెక్టర్ పి.శ్రీనివాసరావు, డిసిఅర్బి ఇన్స్పెక్టర్ పి.ఈశ్వరుడు, ఐ.టి. కోర్ ఎస్.ఐ. డి.రామక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.