SAKSHITHA NEWS

బిఆర్ఎస్ ను వీడుతున్న శంకర్‌పల్లి మైనార్టీలు, భీమ్ భరత్ నాయకత్వం పై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలో చేరిక

శంకర్‌పల్లి: నవంబర్ 15: (సాక్షిత న్యూస్): రానున్న ఎన్నికల్లో బిఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీల లోగుట్టు రాజకీయాలకు తెలంగాణ రాష్ట్ర ముస్లిం, మైనార్టీ ప్రజలు బలైపోయారని చేవెళ్ల నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పామేన భీమ్ భరత్ అన్నారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భీమ్ భరత్ నివాసంలో శంకర్‌పల్లి తెరాస మైనార్టీ నాయకులు సిద్ధిక్ ఆధ్వర్యంలో దాదాపు 50 మంది ముఖ్య నాయకులు తెరాస నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరగా.. వారికి భీమ్ భరత్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం భీమ్ భరత్ మాట్లాడుతూ దొంగ దారిలో అధికారంలోకి రావడానికి ముస్లిం, మైనార్టీల భవిష్యత్ ను పణంగా పెడుతూ తెలంగాణా లో బీజేపీ,
బిఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు నీచ రాజకీయాలకు పాల్పడుతున్న నేపథ్యంలో, వారి ద్రోహాన్ని పసిగట్టిన ముస్లిం సోదరులు కాంగ్రెస్ పార్టీకి తిరిగి అండగా నిలబడటానికి సన్నద్ధం అయ్యారని, పార్టీలో చేరిన ముస్లిం సోదరులే అందుకు నిదర్శనం అని పేర్కొన్నారు.

పార్టీలో చేరిన యువ నాయకుడు సిద్ధిక్ మాట్లాడుతూ, కెసిఆర్ తప్పుడు వాగ్దానాలు నమ్మి మోసపోద్దని, తోటి మైనార్టీలకు పిలుపునిచ్చారు. గతం కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి నాయకుడిగా ఎదిగిన తాను కెసిఆర్ మాటలు నమ్మి తెరాస లోకి వెళ్లానని, కానీ అక్కడికి వెళ్ళాక బిఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీల నీచ రాజకీయ ఒప్పందాన్ని చూసి, నిజమైన మైనార్టీ అభివృద్ధిని ఇప్పటివరకు చేసి చూపించిన కాంగ్రెస్ చెంతకు చేరామని తెలిపారు. ముఖ్యంగా భీమ్ భరత్ నాయకత్వం, పోరాట పటిమ పై పూర్తి నమ్మకంతో ఆయన గెలుపే లక్ష్యంగా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి ఉదయ్ మోహన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, ప్రశాంత్ కుమార్ శ్రీకాంత్ ముదిరాజ్ మాజీ ఎంపిటిసి ఎజాస్, గౌతమ్, నజీర్, ముస్తఫా, కిషోర్, వీరు పాల్గొన్నారు.

Whatsapp Image 2023 11 15 At 7.48.09 Pm

SAKSHITHA NEWS