131 డివిజన్ – గణేష్ నగర్ లో కుత్బుల్లాపూర్ మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వర్ రావు ఆధ్వర్యంలో జరిగిన చేరికల కార్యక్రమంలో గణేష్ నగర్ యూత్ యువజన నాయకులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదేళ్ల కాలంలో సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వం లో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ పథకాలతో రాష్ట్రం చేరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్రాభివృద్ధిలో యువశక్తి తోడైతే రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు.
బిఆర్ఎస్ పార్టీలో చేరిన వారు : డి. సంతోష్ కుమార్, ఎస్. శివ సాయికుమార్, ఎస్. వరుణ్ తేజ, జె. యశ్వంత్ కుమార్, జె. అభిరామ్, రాఘవేంద్ర, జి. మహేష్, చెన్నకేశవ, వెంకటేశం, ప్రకాష్, ఆర్. ప్రదీప్, వెంకటేష్, నాగరాజు…
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గౌరీష్ , బిఆర్ఎస్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షులు దూదిమెట్ల సోమేష్ యాదవ్ , బిఆర్ఎస్ సీనియర్ నాయకులు సత్తి రెడ్డి , గణేష్ నగర్ బిఆర్ఎస్ ప్రెసిడెంట్ వనం శ్రీనివాస్, గణేష్ నగర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు నరసింహ రెడ్డి , వార్డ్ మెంబర్ యాదగిరి సంజీవ రెడ్డి యూత్ నాయకులు సంతోష్ కుమార్, నరేందర్, సాయికుమార్, ప్రదీప్ కుమార్, ప్రకాష్ ,వెంకట్, మహేష్, మధు, రాఘవేంద్ర, పండు, చెన్నకేశవ, శివసాయి ,నాగరాజు, రాజు,ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.