ఎమ్మెల్యే కె.పీ.వివేకానంద్ ని రానున్నఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం : సూరారం డివిజన్ పాస్టర్స్ అసోసియేషన్.
సాక్షిత : 129 డివిజన్ సూరారం పాస్టర్స్ అసోసియేషన్ వారు టీ.ఎస్.ఐ.ఐ.సీ కాలనీ లోని సీనియర్ సిటిజన్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన సమావేశం లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటాం అని ఎకగ్రవ తీర్మానం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ మరియు డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్ సమక్షంలో ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సిద్ధిక్ , చక్క సురేష్, నేతి రాజా, సాయి బాబా, ముకుందం, రాజేశ్, అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.