SAKSHITHA NEWS

ముచ్చటగా మూడోసారి అధికారం బీఆర్ఎస్ పార్టీదే – కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హైదర్ నగర్ కి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు పలువురికి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .
ఈ సందర్భంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ప్రతి ఒక్కరు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరుగుతుంది అని, ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఆశీర్వాదిస్తున్నారని ఆయన తెలిపారు. సంక్షేమ పథకాలను చూసి ఇతర పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు సైతం తమ వెంట రావడం పార్టీకి శుభసూచకం అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి, యువత, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, మరియు వారి ఆశీర్వాదం తో వారి సూచనలు, సలహాలతో పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామని, హైదర్ నగర్ డివిజన్ లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయింది అని నార్నె శ్రీనివాస రావు తెలియచేశారు.. ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ పార్టీ పటిష్టతకు సైనికుడిగా పనిచేయాలని, బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయాలని పేర్కొన్నారు. అందరికి మంచి భవిష్యత్తు ఉంటుందని, ప్రతి ఒక్క కార్యకర్తను కంటికి రెప్పలా చూసుకుంటామని, ప్రతి ఒక్కరం కష్టపడి బంగారు తెలంగాణలో భాగస్వాములం అవుదామని శ్రీనివాస రావు పేర్కొన్నారు. అదేవిధంగా ముఖ్య మంత్రి కెసిఆర్ బంగారు తెలంగాణ నిర్మాణము కోసం ఎంతో కృషి చేస్తున్నారని, మైనార్టీ ల సంక్షేమానికి కృషి చేస్తున్న దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని, అనేక సంక్షేమ పథకాల తో అలరిస్తున్నారు అని, అందులోభాగంగా కల్యాణ లక్ష్మి /షాదీ ముబారక్ షాదీ ముబారక్ ద్వారా పేదింటి ఆడపిల్లకు 1,00,116/- రూపాయలు ఇవ్వడం జరుగుతుందని, ఆసరా పింఛన్లు, ఒంటరిమహిళా పింఛన్లు, కెసిఆర్ కిట్, కంటి వెలుగు, రైతు బంధు, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు వంటి అనేక గొప్ప సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ దేనని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు తెలియజేసారు.

బీఆర్ఎస్ పార్టీ లో చేరిన ముఖ్య నాయకులు ఫసిఉద్దీన్, జహంగీర్, ఇనాయత్, వజీర్ మియా, షేక్ యూసుఫ్, రౌఫ్ మరియు తదితరులు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగినది.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, శ్రేయోభిలాషులు, అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Whatsapp Image 2023 11 03 At 2.58.04 Pm

SAKSHITHA NEWS