బీఆర్ఎస్ పార్టీలో చేరికల జోరు *
ముచ్చటగా మూడోసారి అధికారం బీఆర్ఎస్ పార్టీదే
ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ **
సాక్షిత* :కొండాపూర్ డివిజన్ పరిధిలోని మస్తాన్ నగర్ కాలనీ కి చెందిన కాంగ్రెస్ పార్టీ మరియు బీజేపీ పార్టీల కి చెందిన పలువురు నాయకులు,కార్యకర్తలు, యువకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీ సాయి కుమార్ ఆధ్వర్యంలో వివేకానంద నగర్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో వారికి బీఆర్ ఎస్ పార్టీ కండువా కప్పి బీఆర్ ఎస్ పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించిన ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ .
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ మాట్లాడుతూ యువత అంతా బీఆర్ఎస్ వైపే ఉంది అని,యువత పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, మంచి గా చదువుకొని ఉన్నత స్థితికి చేరుకోవాలని, మీకు అన్ని విధాలుగా అండగా ఉంటామని, కంటికి రెప్పలా చూసుకుంటాను అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ప్రతి ఒక్కరు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరుగుతుంది అని, ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఆశీర్వాదిస్తున్నారని ఆయన తెలిపారు. సంక్షేమ పథకాలను చూసి ఇతర పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు సైతం తమ వెంట రావడం పార్టీకి శుభసూచకం అన్నారు.ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నుండి, బీజేపీ పార్టీ నుండి పెద్ద ఎత్తున యువత, నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, మరియు వారి ఆశీర్వాదం తో, వారి సూచనలు,సలహాలతో పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామని, శేరిలింగంపల్లి లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయింది అని ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ తెలియచేశారు..
ప్రతి ఒక్కరు బీఆర్ ఎస్ పార్టీ పటిష్టతకు సైనికుడిగా పనిచేయాలని, బీఆర్ ఎస్ పార్టీని బలోపేతం చేయాలని పేర్కొన్నారు, అందరికి మంచి భవిష్యత్తు ఉంటుందని, ప్రతి ఒక్క కార్యకర్తను కంటికి రెప్పలా చూసుకుంటామని, ప్రతి ఒక్కరం కష్టపడి బంగారు తెలంగాణలో భాగస్వాములం అవుదామని గాంధీ పేర్కొన్నారు. అదేవిదంగా ముఖ్య మంత్రి కెసిఆర్ బంగారు తెలంగాణ నిర్మాణము కోసం ఎంతో కృషి చేస్తున్నారని ,మైనార్టీ ల సంక్షేమానికి కృషి చేస్తున్న దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని, అనేక సంక్షేమ పథకాల తో అలరిస్తున్నారు అని, అందులోభాగంగా కల్యాణ లక్ష్మి /షాదీ ముబారక్ షాదీ ముబారక్ ద్వారా పేదింటి ఆడపిల్లకు 1 ,00 ,116 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని , ఆసరా పింఛన్లు ,ఒంటరిమహిళా పింఛన్లు,కెసిఆర్ కిట్,కంటి వెలుగు ,రైతు బంధు ,రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు,మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు వంటి అనేక గొప్పసంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ దేనని ప్రభుత్వ విప్ గాంధీ తెలియజేసారు. ప్రతి ఒక్కరు సైనికుడిగా పనిచేయాలని, తెరాస పార్టీని బలోపేతం చేయాలని పేర్కొన్నారు, అందరికి మంచి భవిష్యత్తు ఉంటుందని, ప్రతి ఒక్క కార్యకర్తను కంటికి రెప్పలా చూసుకుంటామని, ప్రతి ఒక్కరం కష్టపడి బంగారు తెలంగాణలో భాగస్వాములం అవుదామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు నాయి నేని చంద్రకాంత్ ,ప్రసాద్ మరియు తదితరులు పాల్గొన్నారు
బీఆర్ఎస్ పార్టీ లో చేరిన ముఖ్య నాయకులు రాజు,గురువయ్య, నగేష్, శ్రీనివాస్, వేణు ఆర్. శ్రీనివాస్, గురు, కార్తిక్ మరియు తదితరులు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగినది.