SAKSHITHA NEWS

మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ కాలనీ లో రూ. 4 కోట్ల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే థీమ్ పార్క్ సుందరికరణ మరియు అభివృద్ధి నిర్మాణం పనులకు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ పార్క్ ను అన్ని రంగాలలో సుందరికరించి,అన్ని హంగులతో ,అన్ని రకాల మౌళిక వసతులతో సుందరికరించి ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకురావాలని, పార్క్ సుందరికరణ మరియు అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని, పనులు నాణ్యత ప్రమాణాల తో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు. వాకింగ్ ట్రాక్ నిర్మాణం ద్వారా పిల్లలకు, పెద్దలకు వాకింగ్ చేసుకోవడానికి సులభంగా ఉండి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అని ఇక్కడి ప్రాంత ప్రజలకు ఎంతగానో తోడ్పడుతుంది అని , పార్క్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ,అన్ని రకాల వసతులు కలిపిస్తామని, పార్క్ లో చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా మయూరి నగర్ పచ్చని చెట్లతో విరాజిల్లాలని, మయూరి నగర్ కు చాలా ప్రాధాన్యత ఉందని ఆ ప్రాధాన్యతలో భాగంగా మయూరి నగర్ లోగల పార్కుల్లో పచ్చని చెట్లు కనిపించాలని దానికి మయూరి నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కృషి చేయాలని సూచించారు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని కాలుష్యాన్ని రూపుమాపి ఆరోగ్యకర వాతావరణానికి చెట్లు ఎంతగానో దోహదపడతాయని, పార్కులో లో పూలు పండ్లు ఆరోగ్యానికి ఉపయోగపడే మొక్కలు నాటి వాటి పరిరక్షణకు సహకరించాలని కోరారు. ప్రభుత్వ పరంగా మయూరి నగర్ అభివృద్ధికి కృషి చేస్తామనీ హామీ ఇచ్చారు. మయూరి నగర్ లో అందరూ ఐకమత్యంగా ఉంటూ రాష్ట్రంలోని ఆదర్శ కాలనీ గా అభివృద్ధి చేసేందుకు అసోసియేషన్ కృషి చేయాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,ఉద్యమకారులు,బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, అభిమానులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

WhatsApp Image 2023 10 07 at 3.36.45 PM

SAKSHITHA NEWS