తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఆడపడుచులకు సారెగా అందింస్తున్న బతుకమ్మ చీరలను 124 డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ ఫేస్ 1 దిన్ దయాల్ వెల్ ఫెయిర్ అసోసియేషన్ కార్యాలయంలో డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ చేతులమీదుగా ఆడపడుచులకు అందించడం జరిగింది.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ బతుకమ్మ పర్వదినం సందర్భంగా ఆడపడుచులకు సారెగా ఉచితంగా చీరలను అందచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి, మంత్రి కేటీఆర్ కి డివిజన్ అడపడచుల తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసారు. తెలంగాణ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలను గౌరవిస్తూ పేదింటి ఆడపడుచులు కూడా పండుగను ఆనందంగా జరుపుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో తెలంగాణ సర్కారు బతుకమ్మ చీరలను అందించడం జరుగుతుంది అన్నారు. ఇందుకు సంబంధించిన చీరల తయారీని కూడా నేత కార్మికులకు అప్పగించి వారి బతుకుల్లో వెలుగులు నింపుతున్నది కూడా మన బిఅరెస్ ప్రభుత్వమే అని కొనియాడారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, సి.ఒ ముస్తఫా, శివరాజ్ గౌడ్, బి.వెంకటేష్ గౌడ్, సంపత్ రెడ్డి, రఘు, నరసింగరావు, వాసుదేవరావు, జనార్దన్, నాగేశ్వరరావు, జీవన్ రెడ్డి, మౌలానా, కుమార చారి, శంకర్, వెంకటేశ్వర్లు, హేమలత, రేణుక, సురేఖ, పర్వీన్ తదితరులు పాల్గొన్నారు.