పేదింటి ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా చీరలు పంపిణీ చేస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వం – జడ్పీ చైర్మన్ జనార్ధన్ రాథోడ్
ఉట్నూర్ మండల కేంద్రములోని రైతు వేదికలో ఎర్పాటు చేసిన బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆడపడుచులకు చీరలు మరియు క్రీడా వస్తువులు పంపిణీ చేసిన ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్ధన్ రాథోడ్ , ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా MLC దండే విఠల్
ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్రంలో సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తున్నారని, గతంలో ఏ ప్రభుత్వాలు కూడా బతుకమ్మ పండగకు చీరలు పంపిణీ చేయలేదని, బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బతుకమ్మ, దసరా పండుగ కానుకగా ప్రతి సంవత్సరం బతుకమ్మ చీరలను అందజేయడం జరుగుతందని అన్నారు. ఆడపడుచులకు పెద్దన్నగా సీఎం కేసీఆర్ చీరలు కానుకగా అందజేస్తున్నారని, బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంతో మండలంలో పండగ వాతావరణం తలపిస్తోందని అన్నారు. ప్రతి ఒక్కరికీ చీరలు అందేవిధంగా ఏర్పాట్లు చూస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ పంద్ర జైవంత్,DRDA PD కిషన్ MPDO తిరుమల, వైస్ ఎంపీపీ దావులే బాలాజీ, కో ఆప్షన్ మెంబర్ రసిద్, PACS చేర్మన్ SP రెడ్డి, జాధవ్ శ్రీరాం నాయక్,BRS పార్టీ మండల అధ్యక్షుడు కందుకూరి రమేష్, జీవ వైవిధ్య కమిటీ సభ్యులు మర్సుకొల తిరుపతి, SC, ST మానిటరింగ్ కమిటీ సభ్యులు కాటం రమేష్, ప్రభాకర్, దరణి రాజేష్, ఎంపిటిసిలు సర్పంచ్ వార్డు మెంబర్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు