అహింసా మార్గంద్వారా ఏదైనా సాధించవచ్చునని ప్రపంచానికి చాటిచెప్పిన మహోన్నత వ్యక్తి గాంధీజీ.
నీతి, నిజాయితీకి నిలువుటద్దం శాస్త్రి
గాంధీజీ ఆశయాలకు తిలోదకాలు ఇచ్చిన జగన్.
బ్రిటిష్ వారు గాంధీ ని సత్యాగ్రహం చేయనిచ్చారు కానీ, నేడు ఏపీ లో కనీసం నిరసన తెలిపే హక్కు కూడా లేదు.
జాతిపిత మహాత్మాగాంధీ,మాజీ ప్రధానమంత్రి లాల్ బహుదూర్ శాస్త్రి గార్ల జయంతి సందర్భంగా కోవూరు తెలుగుదేశం పార్టీ కార్యలయములో వారి ఇరువురి చిత్రపటానికి మాజీ జడ్పీటీసీ సభ్యలు,నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం ప్రధానకార్యదర్శి శ్రీ చేజర్ల వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పూలమాలలు వేసి వారికి నివాళులు అర్పించి జరిగినది. ఈ సందర్భంగా చేజర్ల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ
అహింసా మార్గంలో ఏదైనా సాధించవచ్చునని, భారతదేశానికి స్వాతంత్ర్య సాధించి మహాత్మా గాంధీ నిరూపించారు. అహింసా అనే ఆయుధాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు.యుద్ధాలు,దండయాత్రల తో కొట్టుక చస్తున్న ప్రపంచం అంతా కూడా నేడు గాంధీ మార్గాన్ని అనుచరిస్తూ శాంతియుతంగా చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుంటున్నాయి.
అందుకే ఐక్యరాజ్య సమితి గాంధీ పుట్టినరోజు అయిన అక్టోబర్2 వ తేదీని ప్రపంచ అహింసా దినోత్సవము గా ప్రకటించింది.ఇది భారతీయులు అందరూ గర్వించదగిన విషయం.
గాంధీ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ గాంధీ చూపిన అహింసా మార్గములో పయనించడమే ఆయనకు నిజమయిన నివాళి అర్పించడము.
ప్రపంచమంతా గాంధీ అహింసా బాటలో పయనిస్తుంటే, మన రాష్ట్రంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి పాలనలో హింసాత్మక సంఘటనలు ఎక్కువ కావడం దురదృష్టకరం.
గ్రామ స్వరాజ్యం కావాలని గాంధీ కలలు గన్నారు.అయితే దానిని కూడా వైసిపి ప్రభుత్వం నీరుగారిస్తుంది. స్థానిక సంస్థల నిధులు దారి మళ్లించి వాటిని నిర్వీర్యం చేసింది.
భారతదేశ దివంగత ప్రధానమంత్రి స్వర్గీయ లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవకు ఒక్కసారి గుర్తు చేసుకోవలసిన అవసరం ఉంది.
శాస్త్రి నీతి,నిజాయితీ, నిరాడంబరానికి నిలువుటద్దము లాంటి వాడు.
ఇద్దరు మహనీయులు పుట్టిన అక్టోబర్ 2 వ తేదీ భారతీయులకు పవిత్రమయిన రోజు ఈ సందర్భంగా వారి ఇరువురి నివాళులు అర్పిస్తూ వారు చూపిన బాటలో పయనిద్దాము.
బ్రిటిష్ వారు గాంధీ ని సత్యాగ్రహం చేయనిచ్చారు కానీ, నేడు ఏపీ లో వైసిపి ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలనీ కనీసం నిరసన కూడా తెలిపే అవకాశం ఇవ్వడం లేదు.
ఈ కార్యక్రమములో తెలుగుదేశం పార్టీ నాయకులు కలికి సత్యనారాయణరెడ్డి,బుదవరపు శివకుమార్,ఇందుపూరు మురళీకృష్ణ రెడ్డి, ఇంటురు విజయ్, కుక్కంటి గోపాల్, చిలకూరు నిరంజన్ రెడ్డి, మరుబోయిన వెంకటేశ్వర్లు,సప్పరం వెంకటేశ్వర్లు, పోలిదాసు శ్రీనివాసులు,దువ్వూరు రంగారెడ్డి,తాళ్ళపాక లక్ష్మయ్య,చల్లా మురళి,చల్లా సూర్య,కాకి భగవాన్, కొండా బుజంగరవు,పులా కిరణ్,పులా యశ్వంత్,సాలపక్షి వినయ్ తదితరులు పాల్గొన్నారు.