15 కోట్ల వ్యయంతో నిజాంపేట్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్….
బస్తీ దావాఖన, వైకుంఠ ధామం , ఓపెన్ జిమ్, క్రీడా ప్రాంగణం, అంగన్వాడీ కేంద్రం, నినింటో థీమ్ పార్క్, కమ్యూనిటీ హాల్లు, చిల్డ్రన్ ప్లే ఎక్విప్మెంట్, బాక్స్ క్రికెట్ నెట్, సీసీ రోడ్, బోర్ వెల్స్, వాటర్ సంప్, హైమస్ట్ లైట్స్, దోభి ఘాట్ నిర్మాణ పనులకు, ప్రారంభోత్సవాలు,శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్….
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్యే కె పి వివేకానంద్ , మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి / డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ,కమీషనర్ రామకృష్ణ రావు 7,11,12,13,&14 వ డివిజన్ల పరిధిలో ప్రగతి యాత్ర లో భాగంగా స్థానిక డివిజన్ కార్పొరేటర్లు ప్రణయ ధనరాజ్ యాదవ్,రవికిరణ్,ఆవుల పావని జగన్ యాదవ్,రాజేశ్వరీ వెంగయ్య చౌదరీ తో, కలిసి పాద యాత్ర చేసారు.
పాదయాత్ర లో భాగంగా పలు అభివృద్ధి పనుల 7వ డివిజన్ పరిధిలో 191 కాలనీ లో 13 లక్షల వ్యయంతో బస్తీ దావాఖన ప్రారంభోత్సవం,12లక్షల వ్యయంతో ఓపెన్ జిమ్,45 లక్షల వ్యయంతో 191కాలనీ లో కాంపౌండ్ వాల్ నిర్మాణం,15లక్షల వ్యయంతో క్రీడా ప్రాంగణం,అదే విధంగా 12వ డివిజన్ పరిధిలో 493.10 లక్షల వ్యయంతో వైకుంఠ ధామం అభివృద్ధి పనులు, మరియు ప్రారంభోత్సవం,15 లక్షల వ్యయంతో రెండు ప్రాంతాలలో క్రీడా ప్రాంగణాలు,అంగన్వాడీ కేంద్రం నిర్మాణం,40లక్షల వ్యయంతో అంగన్వాడీ కేంద్రం భవనం నిర్మాణం,35లక్షల వ్యయంతో డివిజన్ పరిధిలో నినింటో థీమ్ పార్క్ నిర్మాణం,30లక్షల వ్యయంతో ఇందిరమ్మ కాలనీ ఫేస్ 3 లో కమ్యూనిటీ హాల్ నిర్మాణం,25లక్షల వ్యయంతో ఇందిరమ్మ కాలనీ ఫేస్ 2 లో కమ్యూనిటీ హాల్ బ్యాలెన్స్ పనులు నిర్మాణం,
అదే విధంగా 14వ డివిజన్ పరిధిలో 30లక్షల వ్యయంతో వెంకటరాయ కాలనీ లో కమ్యూనిటీ హాల్ నిర్మాణం,12లక్షల వ్యయంతో ఓపెన్ జిమ్ ఏర్పాటు,25లక్షల వ్యయంతో ఆచారి కుంట వద్ద,బాలాజీ నగర్ పార్క్ వద్ద టాయ్లెట్స్ మరియు వాచ్మెన్ రూం ఏర్పాటు,30 లక్షల వ్యయంతో 13వ డివిజన్ పరిధిలో ఓపెన్ స్పేసస్ లో కాపౌండ్ వాల్,మరియు గేట్స్ ఏర్పాటు,12లక్షల వ్యయంతో 11వ డివిజన్ పరిధిలో ఓపెన్ జిమ్ ఏర్పాటు,65లక్షల వ్యయంతో ఇన్స్టలేషన్ ఆఫ్ చిల్డ్రన్ ప్లే ఎక్విప్మెంట్, 20లక్షల వ్యయంతో 11వ డివిజన్ కేటీఆర్ కాలనీ పార్క్ అభివృద్ధి పనులు,25లక్షల వ్యయంతో కేటీఆర్ కాలనీ పార్క్ లో బాక్స్ క్రికెట్ నెట్ ఏర్పాటు,20లక్షల వ్యయంతో ఓపెన్ స్పేసస్ లో కాంపౌండ్ వాల్స్ మరియు గేట్స్ ఏర్పాటు,10లక్షల వ్యయంతో కేటీఆర్ కాలనీ పార్క్ లో టాయ్లెట్స్ మరియు వాచ్మెన్ రూం ఏర్పాటు,15.50 లక్షల వ్యయంతో బోర్ వెల్స్, వాటర్ సంప్, హైమస్ట్ లైట్స్ ఏర్పాటు,10లక్షల వ్యయంతో కేటీఆర్ కాలనీ పార్క్ లో వాటర్ పైప్ లైన్ మరియు వైరింగ్ ఏర్పాటు,59లక్షల వ్యయంతో ఎంట్రన్స్ స్కప్చర్,థీమ్ పార్క్,సీసీ కెమెరాల ఏర్పాటు,60లక్షల వ్యయంతో ఈస్ట్ విల్లా లాండ్ మార్క్ నుండి బాలాజీ నగర్ కమాన్ వరకు ఎస్ డబ్ల్యూ డ్రైన్ నిర్మాణం,50లక్షల వ్యయంతో 11&12 వార్డ్ లలో బీటీ రోడ్ నిర్మాణం,35లక్షల వ్యయంతో కేటీఆర్ కాలనీ రోడ్ నె.5 లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మరియు సీసీ రిస్టోరేషన్ నిర్మాణం,10లక్షల వ్యయంతో 13వ డివిజన్ పరిధిలో బస్తీ దవాఖన ఏర్పాటు,5లక్షల వ్యయంతో న్యూ శ్రీనివాస కమ్యూనిటీ హాల్ మిగతా పనులు నిర్మాణం,20లక్షల వ్యయంతో శ్రీలక్ష్మి డ్రై క్లీనింగ్ నుండి కాజిల్ టౌన్ హై స్కూల్ వరకు సీసీ రోడ్ నిర్మాణ పనులు,5లక్షల వ్యయంతో తిరుమల నగర్ లో సీసీ రోడ్ నిర్మాణం,200 లక్షల వ్యయంతో ఆధునిక దోభి ఘాట్ ఏర్పాటు వంటి నిర్మాణ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు,శంకుస్థాపనలు నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో కేటీఆర్ సహకారంతో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రతి వార్డ్ ని అభివృద్ధి పరిచామని ముక్యంగా నిజాంపేట్ పరిదిలో త్రాగునీటి కష్టాలను తొలగించి స్వచ్ఛమైన మంచి నీటి సరఫరా అందిస్తున్నామని అన్నారు, బిఆర్ఎస్ ప్రభుత్వం తోనే నిజాంపేట్ అభివృద్ధి సాధ్యం అని తెలిపారు.అనంతరం పెండింగ్లో ఉన్న పనులను త్వరతగినగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు,NMC బిఆర్ఎస్ అధ్యక్షులు,ఆయా డివిజన్ అధ్యక్షులు మరియు అనుబంధ కమిటీల సభ్యులు సీనియర్ నాయకులు, యువ నాయకులు, మహిళా నాయకులు,మాజీ ప్రజాప్రతినిధులు,NMC ఆయా విభాగాల అధికారులు, మరియు సిబ్బంది,స్థానిక డివిజన్ ఆయా కాలనీల అసోసియేషన్ సభ్యులు,బస్తీ వాసులు,స్థానిక నివాసులు, ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.