SAKSHITHA NEWS

టిడ్కో గృహములపై సమీక్ష నిర్వహించిన కమిషనర్ వికాస్ మర్మత్,

నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో కేటాయించబడిన ఎ.పి.టిడ్కో (జి+3) వెంకటేశ్వరపురము, అల్లీపురము, అక్కచెరువుపాడు, కల్లూరుపల్లి ప్రాంతాల్లోని 365 Sft. మరియు 430 Sft. గృహములకు సంబంధించిన బ్యాంకు ఋణముల పురోగతి పై కమీషనర్ వికాస్ మర్మత్ సమీక్షించారు. కమిషనర్ కార్యాలయంలో హౌసింగ్,మెప్మా, నగర పాలక సంస్థ హౌసింగ్ విభాగం అధికారులతో సమీక్షా సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గృహాలు తీసుకునేందుకు అయిష్టత చూపిన లబ్ధిదారుల స్థానములో క్రొత్త వారిని ఎంపిక చేయాలని, దసరా పండుగలోపు పూర్తి స్థాయిలో పూర్తి చెయ్యాలని, క్రొత్త లబ్దదారులు చెల్లించవలసిన లబ్ధిదారుని వాటా మొత్తమును ఏకమొత్తంగా చెల్లించునట్లు ప్రోత్సహించాలని, వివిధ బ్యాంకుల నుండి మంజూరు కావలసిన లోనులను వెంటనే బ్యాంకు వారిని సంప్రదించి మంజూరు చేయించు కార్యక్రమము యాక్షన్ ప్లాను రూపొందించి, వివిధ కారణములచేత రిజిస్ట్రేషన్ కానీ వారికి వెంటనే రిజిస్ట్రేషన్ చేయునట్లు చర్యలు చేపట్టాలని ఈ కార్యక్రమములో అన్ని డిపార్ట్మెంట్ సిబ్బంది వారి సమన్వయముతో సహాయ సహకారాములతో నిర్దేశిత లక్షాలను పూర్తి చెయ్యాలని సిబ్బందిని ఆదేశించారు.

పై సమీక్షా సమావేశం నందు హౌసింగ్ ఈ ఈ, మెప్మా పి.డి, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్, డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్, సి.ఎమ్.ఎమ్.ఎస్, సి.ఓ స్ మరియు నగరపాలక సంస్థ, హౌసింగ్ ఫర్ ఆల్ సూపరింటెండెంట్ అధికారులు పాల్గొన్నారు.

.


SAKSHITHA NEWS