ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలిసిన వెంకటరావు

SAKSHITHA NEWS

నెల్లూరు జిల్లా

ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలిసిన వెంకటరావు……. కందుకూరు మండల వైసీపీ అధ్యక్షుడు గా విక్కిరాల పేట గ్రామానికి చెందిన గంగవరపు వెంకటరావు నియమితులయ్యారు. శనివారం పట్టణంలోని వైసిపి కార్యాలయంలో ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డిని వెంకట్రావు, మండల వైసీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి మాట్లాడుతూ పదవి అనేది అలంకారం కాదని బాధ్యత అని కావున అందర్నీ కలుపుకొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. అనంతరం వెంకటరావు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి అందర్నీ కలుపుకొని సమన్వయంతో కృషి చేస్తానని అన్నారు. నన్ను నమ్మి మండల అధ్యక్ష పదవి ఇచ్చినందుకు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి, స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డికి వెంకట రావు ధన్యవాదాలు తెలిపారు. సర్పంచులు కుమ్మర బ్రహ్మయ్య ఆవుల మాధవరావు జెసిఎస్ మండల కన్వీనర్ చీమల రాజా జడ్పిటిసి ప్రతినిధి తొట్టెంపూడి శ్రీనివాసులు ఎంపీపీ ప్రతినిధి ఇంటూరి మాధవరావు తోకల కొండయ్య పెంచల రెడ్డి అల్లం రాధయ్య, కొత్తపల్లి బ్రహ్మయ్య, మంగాపతి తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS

Related Posts

You cannot copy content of this page