Chandrababu Arrest: చంద్రబాబు బెయిల్ పిటిషన్పై మరికాసేపట్లో విచారణ
విజయవాడ: ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో సీఐడీ తనపై నమోదుచేసిన కేసులో బెయిలు మంజూరుచేయాలని కోరుతూ తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) దాఖలు చేసిన పిటిషన్పై మరికాసేపట్లో విచారణ జరగనుంది..
తన పాత్రపై ప్రాథమిక ఆధారాలు లేకపోయినా సీఐడీ కేసు నమోదు చేసిందని చంద్రబాబు తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్పై అనిశా కోర్టు మరికాసేపట్లో విచారణ జరపనుంది. ‘ఏపీఎస్ఎస్డీసీ ఛైర్మన్ ఇచ్చిన ఫిర్యాదులో నా పేరు లేదు. కేసులో నా పేరు ఎప్పుడు చేర్చారో కనీసం చెప్పలేదు.
ఏ ఆధారాలతో నన్ను నిందితుడిగా చేర్చారో చెప్పేందుకు సీఐడీ వద్ద ప్రాథమిక వివరాలు లేవు. రాజకీయ ప్రతీకారంతో దురుద్దేశపూర్వకంగా నన్ను ఈ కేసులోకి లాగారు. ముఖ్యమంత్రి ప్రోద్బలంతో నన్ను ఇరికించారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని బెయిలు మంజూరుచేయండి. ప్రధాన వ్యాజ్యాన్ని తేల్చేలోపు.. మధ్యంతర బెయిలు ఇవ్వండి’ అని చంద్రబాబు పిటిషన్లో కోరారు..