SAKSHITHA NEWS
50.00 lakhs for a Hindu crematorium in HMT Hills Colony

సాక్షిత : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని HMT హిల్స్ కాలనీ లో ని హిందూ శ్మశానవాటికను రూ.50.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో జరుతున్న అభివృధి పనులను జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికారులతో కలసి పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు .

ఈ సందర్భంగా నార్నె శ్రీనివాసరావు మాట్లాడుతూ, HMT హిల్స్ కాలనీ లో ఉన్న హిందూ శ్మశానవాటికలో జరుతున్న అభివృధి పనులను పరిశీలించడం జరిగింది అని, అలానే హైదర్ నగర్ డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని, డివిజన్ ను ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దడానికి నా వంతు శాయ శక్తుల కృషి చేస్తానని కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు పేర్కొన్నారు.

అదే విదంగా సిసి రోడ్డు పనులలో జాప్యం లేకుండా, త్వరితగతిన సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని, పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని, జిహెచ్ఎంసి అధికారులకు, కాంట్రాక్టర్కు తగు సూచనలు చేసిన నార్నె శ్రీనివాసరావు . ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, కాంట్రాక్టర్ బాబురావు, కుమారస్వామి, రాజుసాగర్, కాలనీ వాసులు సూరపనేని గోపిచంద్, మూర్తి, మోహన్ తదితరులు పాల్గొన్నారు.