సాక్షిత : నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మేడ్చల్- మల్కాజ్ గిరి జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య మేయర్ శ్రీమతి కోలన్ నీలగోపాల్ రెడ్డి * అధ్యక్షతన డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , ఇంచార్జీ కమిషనర్ రామకృష్ణా రావు తో కలిసి 2023-2024 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ మరియు 17వ సాధారణ సర్వ సభ్య సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా 2023-24 సంవత్సర అంచనా బడ్జెట్ మరియు 2022-23 సంవత్సర సవరణ బడ్జెట్ ను సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.ఈ సమావేశంలో ముఖ్యంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 2023-2024 బడ్జెట్ అంచనా 114.09 కోట్లు,దీనిలో భాగంగా గ్రీన్ బడ్జెట్ మున్సిపల్ సొంత ఆదాయాలు మరియు 15th గ్రాంట్ అంచనా పైన 10 శాతం అనగా 9.2 కోట్లు కేటాయించడం జరిగింది.1/3 వ వంతు బడ్జెట్ కొత్తగా విలీనమైన ప్రాంతాలలో క్లిష్టమైన మౌలిక సదుపాయాల అవసరాలు మరియు ఆభి వృద్ధి చెందుతున్న ప్రాంతాలు మరియు బలహీన వర్గాల మైనార్టీలు మరియు మురికివాడల్లో నివసించే ప్రాంతాలకు 12.37 కోట్లు కేటాయించడం జరిగింది.
ఈ సమావేశంలో భాగంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో SNDP నాలా నిర్మాణ పనులను, రోడ్ వెడల్పు పనులు, డ్రైనేజీ పనులపై సమీక్ష, ఆయా డివిజన్ కాలనీలో ప్రధాన సమస్యలు వాటి పరిష్కారం, బస్తీ దవాఖాన , ఓపెన్ జిమ్స్, క్రీడా ప్రాంగణాలు, వైకుంఠ దామలు , శనిటేషన్, వేసవి కాలం దృశ్య మంజీర నీటి సరఫరా పెంచడం, ఫాగ్గింగ్, పట్టణ అభివృధి పనులు వంటి పలు కీలక ప్రధాన అంశాలపై NMC కార్పొరేటర్లు , కో ఆప్షన్ సభ్యులతో సుధీర్ఘ చర్చా సమావేశం నిర్వహించడం జరిగింది.. అనంతరం జాతీయ పోషణాపక్షం సందర్భంగా ప్రతి ఇంటికి సరైన పోషణ, పోషకాహారం, తాగునీరు , పరిశుభ్రతలపై సమాచారం ఇస్తూ అంగన్వడి టీచర్స్ తో కలిసి ప్రతిజ్ఞ చేయడం జరిగింది..
ఈ సమావేశంలో NMC ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ ఆగం పాండు ముదిరాజ్ , కార్పొరేటర్లు , కో ఆప్షన్ సభ్యులు, NMC అధికారులు SE,DE,AE లు,ఇంజనీరింగ్,శానిటేషన్,టౌన్ ప్లానింగ్,ఎలక్ట్రికల్, వాటర్ వర్క్స్,మరియు ఇతర ముఖ్య విభాగాల సంబంధిత అధికారులు మరియు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.