ఎన్‌సీసీ జీపీ హెడ్‌క్వార్టర్ సికింద్రాబాద్ నేతృత్వంలో 1టీ గాళ్స్ బెటాలియన్ ఎన్‌సీసీ కంబైన్డ్ వార్షిక శిక్షణ ప్రారంభం ; ఇది మే 01 నుంచి 10 మే 2023 వరకూ ఉంటుంది
సాక్షితహైదరాబాద్ : ఎన్‌సీసీ వార్షిక శిబిరాన్ని 600 మంది బాలికా క్యాడెట్స్ కోసం బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ ఫర్ ఉమెన్ కళాశాలలో నిర్వహిస్తున్నారు. ఎన్‌సీసీ జీపీ హెడ్‌క్వార్టర్ సికింద్రాబాద్ నేతృత్వంలో 1 తెలంగాణా గాళ్స్ బెటాలియన్ ఎస్‌సీసీ దీనిని 01 మే నుంచి 10 మే 2023 వరకూ నిర్వహించనుంది. ఈ క్యాడెట్లకు పలు మిలటరీ అంశాలైనటువంటి ఆయుధ శిక్షణ, మ్యాప్ రీడింగ్, ఫీల్డ్ క్రాఫ్ట్/బ్యాటిల్ క్రాఫ్ట్ మరియు లీడర్‌షిప్‌లో శిక్షణ అందిస్తున్నారు.
ఈ శిబిరంలో భాగంగా క్యాడెట్లకు ఇతర అంశాలైనటువంటి మార్చింగ్ డ్రిల్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, లెక్చర్ కమ్ డిమాన్‌స్ట్రేషన్‌ను పలు అంశాలపై అందించడంతో పాటుగా క్రీడా పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ క్యాడెట్లకు ఆయుధాలను వినియోగించడం లో కూడా శిక్షణ అందిస్తున్నారు.
ఈ క్యాడెట్లు పలు సామాజిక సేవా కార్యక్రమాలను సైతం ఈ శిబిరంలో చేసే అవకాశం కల్పించారు. వీటిలో స్వచ్ఛభారత్, రక్తదాన శిబిరం వంటివి ఉన్నాయి. వీటితో పాటుగా ఒత్తిడి నిర్వహణ పద్ధతులు, వ్యర్థాల రీసైక్లింగ్ టెక్నిక్స్, ఎడ్వెంచర్ యాక్టివిటీలు మరియు తమ రంగాలలో నిష్ణాతుల చేత గెస్ట్ లెక్చర్స్ తో కెరీర్ కౌన్సిలింగ్ అందించడం ఉన్నాయి.
ఈ శిబిరాన్ని ఆఫీసర్ కమాడింగ్ లెఫ్టినెంట్ కల్నల్ ప్రదీప్ కుమార్ తో పాటుగా ఆయన డైనమిక్ టీమ్ అయిన అడ్మిన్ ఆఫీసర్, 05 అసోసియేట్ ఎన్‌సీసీ ఆఫీసర్లు, 02 గాళ్ క్యాడెట్ ఇన్‌స్ట్రక్టర్లు, 15 మిలిటరీ సిబ్బంది నేతృత్వంలో జరుగుతుంది.