అన్నమయ్య జిల్లా రాజంపేట అటవీ పరిధిలో 19ఎర్రచందనం దుంగలు స్వాధీనం
రాజంపేట అటవీ పరిధిలో సోమవారం ఉదయం 19ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్సు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్సు ఎస్పీ కే.చక్రవర్తి ఆదేశాల మేరకు డీఎస్పీ మురళీధర్ అధ్వర్యంలో ఆర్ఐ చిరంజీవులుకు చెందిన రాఘవేంద్ర టీమ్ అన్నమయ్య జిల్లా సానిపాయ రేంజ్ పింఛా సెక్షన్ కూంబింగ్ చేపట్టారు. అక్కడే జిల్లేళ్ల మంద పారెస్ట్ బీట్ పరిధిలో నల్లబండలు, పోరాకనుమల మధ్య కొంతమంది ఎర్రచందనం దుంగలను మోసుకుని వెళుతూ కనిపించారు. వారిని సమీపించడంతో వారు దుంగలను పడేసి పారిపోయారు ఆ ప్రాంతంలో 19ఎర్రచందనం దుంగలు లభించాయి. వీటిని తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్కు తరలించగా, ఎస్ఐ మోహన్ నాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రాజంపేట అటవీ పరిధిలో 19ఎర్రచందనం దుంగలు స్వాధీనం
Related Posts
ప్రభుత్వం పీవీ సింధుకు కేటాయించిన 2 ఎకరాల స్థలంపై వివాదం
SAKSHITHA NEWS ప్రభుత్వం పీవీ సింధుకు కేటాయించిన 2 ఎకరాల స్థలంపై వివాదం ప్రభుత్వం పీవీ సింధుకు కేటాయించిన 2 ఎకరాల స్థలంపై వివాదంAP: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీసీ సింధుకు గత ప్రభుత్వం విశాఖ జిల్లాలో కేటాయించిన రెండు ఎకరాల స్థలం…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్ గా రిటైర్డ్ ఐఏఎస్
SAKSHITHA NEWS ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్ గా రిటైర్డ్ ఐఏఎస్ (1984) అనిల్ చంద్ర పునీతను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. SAKSHITHA NEWS