18వ డివిజన్ లో పర్యటించిన ఎమ్మెల్యే *
సాక్షిత, : నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18వ డివిజన్ నందనవనం కాలనీలోని నూతన రోడ్లు మరియు డ్రైనేజ్ సమస్యలపై కాలనీ సభ్యులు స్థానిక కార్పొరేటర్ కోలన్ వీరేందర్ రెడ్డి కి తెలుపగా వారి సమస్యలను విన్న కార్పొరేటర్ కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు (ఎమ్మెల్యే) కేపీ వివేకానంద దృష్టికి తీసుకువెళ్లగా తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే కార్పొరేటర్ తో కలసి కాలనీ ప్రజల వద్దకు వచ్చి కాలనీ లోని ప్రతీ వీధికి వెళ్లి వారి సమస్యలను స్వయంగా చూసి మరియు వారి మాటల ద్వారా తెలుసుకున్నారు…..*
ఎమ్మెల్యే వారి అమూల్యమైన సమయానికి కేటాయించి కాలనీ వాసులతో ప్రత్యేక సమావేశంలో పాల్గొని వారి సమస్యల గురించి మాట్లాడడం జరిగింది ….
వారి వారి కాలనీల సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే పై అధికారులతో మాట్లాడి కాలనీ సమస్యల పరిష్కారంపై చర్చించడం జరిగింది….
అనంతరం ఎమ్మెల్యే వారి సమస్యలను అతి త్వరలోనే నూతన రోడ్లు మరియు డ్రైనేజ్ లైన్ వేయిస్తామని కాలనీ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది…
ఎమ్మెల్యే మాటలకూ వారు ఇచ్చిన హామీలకు మరియు కార్పొరేటర్ ప్రత్యేక దృష్టికి వారి సహకారానికి కాలనీలోని ప్రజలు ధన్యవాదములు తెలిపి ఆనందంతో హర్షం వ్యక్తం చేశారు…
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కోలన్ వీరేందర్ రెడ్డి కార్పొరేటర్లు సురేష్ రెడ్డి , రాజేశ్వరి చౌదరి ,nmc తెరాస అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ nmc కమిషనర్ వంశీకృష్ణ , DEE సుదర్శన్ , AEE దిరాజ్ , 14వ డివిజన్ అధ్యక్షులు బొబ్బ శ్రీను మరియు నందనవనం కాలనీ సంక్షేమ సంఘాల నాయకులు,సీనియర్ నాయకులు, మహిళలు, యువకులు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు…