124 డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ పరిధిలోని కమలమ్మ కాలనీ పెద్ద మనుషులతో సమావేశమై కాలనీ సమస్యల మీద పాదయాత్ర చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాలనీ వాసులు కమలమ్మ కాలనీలో కొంతమేర డ్రైనేజీ లైన్ మరియు సీసీ రోడ్లు పెండింగులో ఉన్న సమస్యలను కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. అలాగే విద్యుత్ కు సంబంధించిన సమస్యలు కూడా ఉన్నాయని తెలిపారు. కార్పొరేటర్ మాట్లాడుతూ కాలనీ లో పెండింగ్ ఉన్న డ్రైనేజీ మరియు సీసీ రోడ్లను అతిత్వరలో పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా రానున్న పార్లమెంట్ ఎన్నికలలో చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు మనందరం కృషి చేయాలని కాలనీ వారిని కోరారు. కాలనీ వాసులందరు కాంగ్రెస్ పార్టీకు మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పాండుగౌడ్, వాసుదేవరావు, గణేష్, జాన్, వెంకటేష్, విక్రమ్, రాజు మరియు కమలమ్మ కాలనీ వాసులు పాల్గొన్నారు.
124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ పరిధిలోని కమలమ్మ కాలనీ
Related Posts
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జగద్గిరిగుట్ట లోని లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవస్థాన
SAKSHITHA NEWS కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జగద్గిరిగుట్ట లోని లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవస్థాన నూతన కమిటీ సభ్యులు టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి ని కలిసి ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో…
ఉపాధ్యాయ, విద్యారంగా, సామాజిక సమస్యలపై పోరాటమే ఎజెండా..
SAKSHITHA NEWS ఉపాధ్యాయ, విద్యారంగా, సామాజిక సమస్యలపై పోరాటమే ఎజెండా.. ఎమ్మెల్సీ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి…( సాక్షిత ప్రతినిధి కోదాడ సూర్యాపేట జిల్లా)విద్యా, వైద్యం ప్రభుత్వ రంగంలోనే ఉండాలి…కేంద్రం బడ్జెట్ లో విద్యకు పది శాతం నిధులు కేటాయించాలి.ఎమ్మెల్సీగా ఉపాధ్యాయ, ఉద్యోగుల…