హామీల అమలులో కాంగ్రెస్ విఫలం….
420 వాగ్దానాలతో ప్రజలను మోసం చేశారని,
ప్రశ్నిస్తున్న రామగుండం కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకురాలు సోమారపు లావణ్య…
సాక్షిత పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి, గోదావరిఖని/ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర నాయకురాలు సోమారపు లావణ్య విమర్శించారు. బీజేపీ వారం రోజుల కార్యాచరణలో భాగంగా ఆమె ఆధ్వర్యంలో రామగుండం నియోజకవర్గంలోని 8 ఇంక్లైన్ కాలనీలో ‘ప్రశ్నిస్తున్న రామగుండం’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ పార్టీకి చెందిన 14వ డివిజన్ కార్పొరేటర్ బడావాత్ శంకర్ నాయక్, 17వ డివిజన్ కార్పొరేటర్ అనుము స్వరూప–రాములు, 18వ డివిజన్ కార్పొరేటర్ దేవనపల్లి చక్రపాణి, 19వ డివిజన్ కార్పొరేటర్ మారెల్లి సుశీలకు బీజేపీ నాయకులు వినతిపత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు. రైతు భరోసా, రుణమాఫీ, మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, తులం బంగారం, నిరుద్యోగ భృతి, వృద్ధాప్య పింఛన్ల పెంపు వంటి హామీల విషయంలో ప్రభుత్వం ప్రజలను నిరాశకు గురిచేసిందని విమర్శించారు.
420 వాగ్దానాలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకే ‘ప్రశ్నిస్తున్న రామగుండం’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ప్రజా సమస్యలపై కార్పొరేటర్లు కౌన్సిల్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలని, 8 ఇంక్లైన్ కాలనీలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా ఉపాధ్యక్షురాలు మాతంగి రేణుక, సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్ దాసరి శ్రీనివాస్, సుశీల, నాయకులు కన్నూరి భాస్కర్, కొమ్మ శ్రీనివాస్ యాదవ్, అరిగేలా శ్రావణ్ యాదవ్, పొట్ల వెంకటేష్, మారేపల్లి శ్రీనివాస్, అంకం కుమార్, పంగ రవి, బోటుకు మల్లేష్, పొట్ల శశాంక్, మెరుగు శ్రీనివాస్, రాజేష్ నాయక్, నాగేందర్, ఎడ్లపురం రమేష్, నారీ, కుందారపు సత్యనారాయణ, ఇల్లందుల మహేష్, భాస్కర్, క్రాంతి, పొట్ల సాయితేజ, శాంతిరాజ్, వివేక్, సాయికుమార్‌తో పాటు మహిళా నాయకురాళ్లు పానుగంటి అంజలి, కరుపాకుల మాధవి తదితరులు, బీజేపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST