మహిళలు కేవలం పొదుపు చర్యలకు మాత్రమే పరిమితం

Sakshitha news

మహిళలు కేవలం పొదుపు చర్యలకు మాత్రమే పరిమితం కాకుండా వ్యాపార రంగాల్లో రాణించి ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తుంది – దేవరకద్ర శాసన సభ్యులు జి. మధుసూదన్ రెడ్డి
మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు మహిళా సంఘాల సభ్యులకు జిల్లా యంత్రంగా చేయుతనందిస్తుంది – జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
మహిళా సంఘాలకు చెందిన రెండు బస్సులు ప్రారంభోత్సవం, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తో కలిసి మిరాస్ పల్లి లో మహిళా సంఘాల పెట్రోల్ బంక్ కు భూమి పూజ చేసిన దేవరకద్ర శాసన సభ్యులు జి. మధుసూదన్ రెడ్డి

సాక్షిత వనపర్తి :
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా జూన్, 25 నుండి ప్రారంభమైన మహిళా శక్తి వారోత్సవాల్లో భాగంగా దేవరకద్ర శాసన సభ్యులు జి. మధుసూదన్ రెడ్డి కొత్తకోట బస్టాండ్ లో దేవరకద్ర నియోజకవర్గానికి చెందిన మహిళా సంఘాల రెండు ఆర్టీసీ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు.
అనంతరం అదే బస్సులో మహిళా సంఘాల సభ్యులతో కలిసి మిరాస్ పల్లి వరకు ప్రయాణించి మిరాస్ పల్లి జాతీయ రహదారిపై మహిళా సంఘాలకు ప్రభుత్వ సబ్సిడీ పై రూ. 2.00 కోట్ల అంచనా వ్యయంతో మంజూరు చేసిన భారత్ పెట్రోలియం బంక్ కు భూమి పూజ చేశారు.
అనంతరం శాసన సభ్యులు మీడియాతో మాట్లాడుతూ ఒకప్పుడు మహిళలు కేవలం పొదుపు చర్యలకు మాత్రమే పరిమితం అమయ్యేదని కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి అనేక సంక్షేమ పథకాలను మహిళా సంఘాల సభ్యులకు అందజేయడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగానే సబ్సిడీ పై ఆర్టీసీ బస్సులు ఇప్పించడం, పెట్రోల్ బంక్ లు కేటాయించడం, క్యాంటీన్లు ఏర్పాటు చేయడం వంటి వ్యాపారాభివృద్ధి పనులు ఇవ్వడం జరుగుతుందన్నారు. నారాయణపేట జిల్లాలో మహిళా సంఘాల సభ్యులకు మంజూరు చేసిన పెట్రోల్ బంక్ ద్వారా మహిళలు అన్ని ఖర్చులు పోను ఏడాదికి 13 లక్షల లాభాలు ఆర్జించారని తెలియజేశారు. ఆర్టీసీ బస్సులకు యజమానులు చేయడం ద్వారా ఆర్టీసీ యాజమాన్యానికి అద్దెకు బస్సులు ఇచ్చి ప్రతి నెల 70 వేల రూపాయలు అద్దె వసూలు చేస్తున్నట్లు తెలియజేశారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక అనేది భారత దేశంలోనే మొదటిదని, ఇందులో భాగంగా చివరిదైన మహిళా శక్తి వారోత్సవాలు మే, 25 నుండి ప్రారంభం అయ్యాయన్నారు. అందులో భాగంగానే ఈరోజు మహిళా సంఘాలకు సంబంధించిన పెట్రోల్ బంక్ భూమి పూజ, బస్సు ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. జాతీయ రహదారిపై ఎంతో విలువైన ఒక ఎకరం భూమిని తన నియోజకవర్గంలోని మహిళా సంఘాలకు కేటాయించినందుకు జిల్లా కలెక్టర్ కు ధన్యవాదాలు తెలిపారు. వచ్చే 90 రోజుల్లో పెట్రోల్ బంక్ పనులు పూర్తి చేసుకొని ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని తెలిపారు.


జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ జిల్లాలోని మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు జిల్లా యంత్రాంగం చేయుతనందిస్తుందని తెలిపారు. అందులో భాగంగా భారత్ పెట్రోలియం సంస్థతో ఒప్పందం చేసుకొని రూ. 3.00 కోట్ల విలువైన ఎకరం స్థలాన్ని మహిళా సంఘాలకు పెట్రోల్ బంక్ ఏర్పాటుకు కేటాయించడం జరిగిందన్నారు. 2 కోట్ల అంచనా వ్యయంతో భారత్ పెట్రోలియం సంస్థ వారు పెట్రోల్ బంక్ ఏర్పాటు చేస్తుందన్నారు. మహిళా సంఘాల పెట్రోల్ బంక్ జాతీయ రహదారి పై ఉండటం ఇదే మొదటిదని, బంక్ ప్రారంభించాక మహిళలు మంచి లాభాలను ఆర్జించవచ్చని అన్నారు.
పి.డి.డి.ఆర్డీఓ ఉమాదేవి, భరత్ పెట్రోలియం ట్రేడింగ్ మేనేజర్ శఫాలి సింగ్, ఇంజనీరింగ్ సింగ్, ఇంజనీరింగ్ మేనేజర్ అభిషేక్ సింగ్, మదనపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రశాంత్, ఆర్టీసీ డిపో మేనేజర్, ఇతర ప్రజా ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top