నేపాల్ విపత్తు బాధితులకు శ్రీరామానుజ సేవా ట్రస్టు అండ

Sakshitha news

నేపాల్ విపత్తు బాధితులకు శ్రీరామానుజ సేవా ట్రస్టు అండ

రూ.10.55 లక్షల విరాళం సేకరణ – ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చేతుల మీదుగా అందజేత

ప్రకృతి విలయంతో తీవ్ర భయానక విపత్తును ఎదుర్కొంటున్న నేపాల్ బాధితుల సహాయార్థం శ్రీరామానుజ సేవా ట్రస్టు ఆధ్వర్యంలో చేపట్టిన సహాయ కార్యక్రమానికి దాతలు మానవతా దృక్పథంతో స్పందించారు.

ఈ కార్యక్రమానికి ఇప్పటివరకు రూ.10,55,116/- విరాళంగా జమ అయినట్లు ట్రస్టు ప్రతినిధులు తెలిపారు. సేకరించిన మొత్తాన్ని చెక్కు రూపంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చేతుల మీదుగా, డీఆర్‌డీఓ మాజీ చైర్మన్, ప్రధానమంత్రికి రక్షణ సలహాదారు జి. సతీష్ రెడ్డి కి అందజేయనున్నట్లు తెలిపారు.

ఈ విరాళాన్ని అనంతరం నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి అందజేయనున్నట్లు పేర్కొన్నారు.

ప్రకృతి విపత్తు సమయంలో బాధితుల కోసం స్పందించి, తమ వంతు సహాయాన్ని అందించిన ప్రతి దాతకు శ్రీరామానుజ సేవా ట్రస్టు తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డా. ధనుంజయ
శ్రీరామానుజ సేవా ట్రస్టు మాజీ కార్పొరేటర్ లు ప్రభుదాస్ శ్రీనివాస్ రెడ్డి BRS పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.