గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే జారె
సాక్షిత న్యూస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ దమ్మపేట మండలం పెద్దగొల్లగూడెం గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులతో కలిసి మొక్కలు నాటి విద్యార్థులకు అందిస్తున్న విద్యావిధానం గురించి తెలుసుకున్నారు. తరగతి గదులను వసతి గృహాన్ని పరిశీలించి విద్యార్థులతో మాట్లాడి వారి ప్రతిభను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారం చేస్తూ వారికి అందిస్తున్న భోజన నాణ్యతను స్వయంగా తనిఖీ చేశారు. సిబ్బందితో మాట్లాడుతూ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడానికి ఉపాధ్యాయులు శక్తివంచన లేకుండా కృషి చేయాలని సూచించారు. భోజనంలో కొత్త మెను విధానం కచ్చితంగా పాటించాలని నాణ్యమైన ఆహారం అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం జరగకూడదని ఆదేశించారు.
విద్యార్థులకు అసౌకర్యం కలిగితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
