సాన్ ఫోర్ట్ ప్లే స్కూల్ ని ప్రారంభించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

Sakshitha news

సాన్ ఫోర్ట్ ప్లే స్కూల్ ని ప్రారంభించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ బౌరంపేట్ 295 డివిజన్ లోని డిపీఎస్ స్కూల్ మార్గంలో ఈరోజు నూతనంగా ఏర్పాటు చేసిన సాన్ ఫోర్ట్ ప్లే స్కూల్ ను ప్రారంభించిన మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు .

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్లే స్కూల్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని, ప్లే స్కూల్ అంటే ఇటుకలు మరియు సున్నాలతో కూడిన భవనం మాత్రమే కాదని ఇది పిల్లల భవిష్యత్తుకు పునాది వేసే స్థలమని తెలిపారు. ప్లే స్కూల్ అనేది ఉత్సుకత, దయను పెంపొందించే మరియు ఆట ద్వారా నేర్చుకోవడంలో ఆనందాన్ని నేర్పే ప్రదేశం అని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో బౌరంపేట్ ప్యాక్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, తాజా మాజీ కౌన్సిలర్లు శంభీపూర్ కృష్ణ, బెంబడి బుచ్చిరెడ్డి, మురళి యాదవ్, విష్ణువర్ధన్ రెడ్డి, హనుమంతరావు, సీనియర్ నాయకులు ఎస్వి సురేందర్ రెడ్డి, ధర్మారెడ్డి, బైండ్ల గోపాల్, పాక్స్ డైరెక్టర్ జీతయ్య, మరియు స్థానిక నాయకులు, ప్లే స్కూల్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు…

Scroll to Top