“ఉద్యోగాలు ఎక్కడ? విద్యా భరోసా కార్డు ఎక్కడ? స్కూటీలు ఎక్కడ?”- డాక్టర్ మెతుకు ఆనంద్
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు, కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని నిరసిస్తూ, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో యువతి, యువకుల భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.
BJR చౌరస్తా నుంచి NTR చౌరస్తా వరకు సాగిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో యువత పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ…
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు యువతను, విద్యార్థులను, నిరుద్యోగులను ఆకట్టుకునేలా అనేక హామీలు ఇచ్చిందని, కానీ అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తవుతున్నా ఆ హామీల అమలుకు మాత్రం చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.
ప్రతి మండలంలో అంతర్జాతీయ స్థాయి పాఠశాలలు ఏర్పాటు చేస్తామని, వాటికి ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. మరి ఆ అంతర్జాతీయ పాఠశాలలు ఎక్కడ? ఉచిత రవాణా సౌకర్యం ఎక్కడ?” అని ప్రశ్నించారు.
18 సంవత్సరాలు నిండిన ప్రతి విద్యార్థికి స్కూటీలు ఇస్తామని హామీ ఇచ్చారు. మరి ఆ స్కూటీలు ఎక్కడ?” అంటూ నిలదీశారు.
అదేవిధంగా విద్యార్థుల ఉన్నత విద్య కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన విద్యా భరోసా కార్డు ఏమైంది? అని ప్రశ్నించారు.
నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను కూడా డాక్టర్ మెతుకు ఆనంద్ గుర్తు చేశారు.
“ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. మరి ఆ 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ? జాబ్ క్యాలెండర్ ఎక్కడ?” అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కేవలం ప్రచారానికి పరిమితం చేయకుండా, వాటిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి…
నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలి…
యువతకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి…
లేనిపక్షంలో యువత తరఫున BRS పార్టీ మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతుందని డాక్టర్ మెతుకు ఆనంద్ హెచ్చరించారు.
1000 రోజుల పాలన… హామీలు ఎక్కడ?
యువతకు సమాధానం చెప్పాలి – కాంగ్రెస్ ప్రభుత్వం!


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST