PEOPLE ప్రజలకు స్థానికంగానే అందుబాటులో కావాల్సినంత ఇసుక: ప్రత్తిపాటి పుల్లారావు

SAKSHITHA NEWS

PEOPLE ప్రజలకు స్థానికంగానే అందుబాటులో కావాల్సినంత ఇసుక: ప్రత్తిపాటి పుల్లారావు

కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఇసుక విధానంతో ప్రజలందరికీ స్థానికంగానే కావాల్సినంత ఇసుక అందించే అవకాశం లభించిందని హర్షం వ్యక్తం చేశారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. వైకాపా హయాంలో ట్రక్కుకు రూ.20 వేలు ఆ పైన కూడా పెట్టిన పరిస్థితుల నుంచి నామమాత్రపు ధరకే ఇసుక అందిస్తుండడం సామాన్య, మధ్యతరగతికి అతిపెద్ద ఊరటగా పేర్కొన్నారు. ఈ మేరకు ఒక పత్రికా ప్రకటన విడుదల చేసిన ఆయన పల్నాడు జిల్లా ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
జిల్లాలో మొత్తం ఆరు చోట్ల ఇసుక సరఫరా కేంద్రాలు ఏర్పాటు చేశామని, వాటి వివరాలు వెల్లడించారు. వైకుంఠపురం, కోనూరు, కొత్తపల్లి, మాదిపాడు, వినుకొండ, కొండమోడు స్టాక్ యార్డుల్లో సరఫరాకు నిల్వలు సిద్ధంగా ఉన్నాయన్నారు ప్రత్తిపాటి. ఇందుకు సంబంధించి ప్రభుత్వ నిర్ణయించిన ధరలు మాత్రమే చెల్లించి కోటా మేరకు ఇసుక తీసుకోవచ్చని ప్రజలకు తెలియజేశారు. అయిదే ళ్లుగా జగన్‌రెడ్డి అమలు చేసిన దుర్మార్గపు విధానాలు రద్దు చేయడం ద్వారానే ఇది సాధ్యమైంద న్నారు. ఇకపై దళారీలకు వేల రూపాయలు కప్పం కట్టాల్సిన పనిలేదని, ఇసుక దొరుకుతుందో లేదో, ఇంటి పనులుకు ముందుకు సాగుతాయో లేదో అన్న భయాలు ఇక అవసరం లేదన్నారు ప్రత్తిపాటి. దీనిద్వారా భవననిర్మాణ కార్మికులు, ఆ రంగంపై ఆధారపడిన ఇతర విభాగాల వారు ఉపాధి, వ్యాపార అవకాశాల విషయంలో బెంగ పెట్టుకోవక్కర్లేదన్నారు. ‌ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా ఇటువంటి కీలక నిర్ణయం తీసుకుని అందరికీ ఊరటనిచ్చిన ముఖ్య మంత్రికి ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారన్నారు.

WhatsApp Image 2024 07 10 at 14.07.46

SAKSHITHA NEWS

sakshitha

Related Posts

PRATTIPATI కార్పొరేట్‌కు ధీటుగా చిలకలూరిపేట వంద పడకల ఆస్పత్రి: ప్రత్తిపాటి

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSPRATTIPATI కార్పొరేట్‌కు ధీటుగా చిలకలూరిపేట వంద పడకల ఆస్పత్రి: ప్రత్తిపాటి చిలకలూరిపేట వంద పడకల ఆస్పత్రిని పరిశీలించిన ప్రత్తిపాటి ఆస్పత్రి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై వైద్యులతో ప్రత్తిపాటి సమీక్ష కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా స్థానిక వంద పడకల ఆస్పత్రిని తీర్చిదిద్ది…


SAKSHITHA NEWS

AIRPORT అనంతపురంలో ఎయిర్ పోర్టు ఏర్పాటుపై రామ్మోహన్ నాయుడు స్పందన

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSAIRPORT అమరావతి అనంతపురంలో ఎయిర్ పోర్టు ఏర్పాటుపై రామ్మోహన్ నాయుడు స్పందన ఎయిర్ పోర్టుకు 1,200 ఎకరాల భూమి అవసరమవుతుందన్న రామ్మోహన్ నాయుడు భూమి చూపిస్తే విమానాశ్రయం ఏర్పాటుపై అధ్యయనం చేస్తామని వెల్లడి ఎయిర్ పోర్ట్ కోసం ఇటీవల రామ్మోహన్…


SAKSHITHA NEWS

You Missed

PONGULETI పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన*

 • By sakshitha
 • జూలై 13, 2024
 • 21 views
PONGULETI పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన*

FESTIVALS మొదలైన ఆషాడ పాండురంగ స్వామి ఉత్సవాలు

 • By sakshitha
 • జూలై 13, 2024
 • 37 views
FESTIVALS మొదలైన ఆషాడ పాండురంగ స్వామి ఉత్సవాలు

BJP బీజేపీ జిల్లా ఆర్మీ సెల్ అధ్యక్షులు గా నీల చంద్రం

 • By sakshitha
 • జూలై 13, 2024
 • 32 views
BJP బీజేపీ జిల్లా ఆర్మీ సెల్ అధ్యక్షులు గా నీల చంద్రం

GHAZWAL గజ్వేల్ లో నవోదయ మోడల్ పరీక్ష

 • By sakshitha
 • జూలై 13, 2024
 • 26 views
GHAZWAL గజ్వేల్ లో నవోదయ మోడల్ పరీక్ష

BATON CHARGE శాంతియిత నిరసనపై లాఠీఛార్జ్ తగదు

 • By sakshitha
 • జూలై 13, 2024
 • 22 views
BATON CHARGE శాంతియిత నిరసనపై లాఠీఛార్జ్ తగదు

GOD భగవంతుని సేవకు మించిన భాగ్యం మరొకటిలేదు

 • By sakshitha
 • జూలై 13, 2024
 • 23 views
GOD భగవంతుని సేవకు మించిన భాగ్యం మరొకటిలేదు

You cannot copy content of this page