నేపాల్ విపత్తు బాధితులకు శ్రీరామానుజ సేవా ట్రస్టు అండ
రూ.10.55 లక్షల విరాళం సేకరణ – ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చేతుల మీదుగా అందజేత
ప్రకృతి విలయంతో తీవ్ర భయానక విపత్తును ఎదుర్కొంటున్న నేపాల్ బాధితుల సహాయార్థం శ్రీరామానుజ సేవా ట్రస్టు ఆధ్వర్యంలో చేపట్టిన సహాయ కార్యక్రమానికి దాతలు మానవతా దృక్పథంతో స్పందించారు.
ఈ కార్యక్రమానికి ఇప్పటివరకు రూ.10,55,116/- విరాళంగా జమ అయినట్లు ట్రస్టు ప్రతినిధులు తెలిపారు. సేకరించిన మొత్తాన్ని చెక్కు రూపంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చేతుల మీదుగా, డీఆర్డీఓ మాజీ చైర్మన్, ప్రధానమంత్రికి రక్షణ సలహాదారు జి. సతీష్ రెడ్డి కి అందజేయనున్నట్లు తెలిపారు.
ఈ విరాళాన్ని అనంతరం నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి అందజేయనున్నట్లు పేర్కొన్నారు.
ప్రకృతి విపత్తు సమయంలో బాధితుల కోసం స్పందించి, తమ వంతు సహాయాన్ని అందించిన ప్రతి దాతకు శ్రీరామానుజ సేవా ట్రస్టు తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డా. ధనుంజయ
శ్రీరామానుజ సేవా ట్రస్టు మాజీ కార్పొరేటర్ లు ప్రభుదాస్ శ్రీనివాస్ రెడ్డి BRS పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST