— నేటి యువత రేపటి భవిష్యత్ – ఎంపీపీ
— సీఎం కప్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులని అందజేసిన జెడ్పీ సీఈవో, ఎంపీపీ
చిట్యాల సాక్షిత ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గత మూడు రోజులుగా పెద్దకాపర్తి జెడ్పి హైస్కూల్లో నిర్వహించిన మండల స్థాయి క్రీడా పోటీలలో విజేతలకు బహుమతలని అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతథులు జడ్పీ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, మండల పరిషత్ అధ్యక్షులు కొలను సునీత వెంకటేష్ గౌడ్ లు పాల్గొని విజేతలకు ట్రోఫీ, ప్రశంసా పత్రాలు, మరియు మెడల్స్ లను అందజేశారు. ఈ సందర్భంగా
జడ్పీ సిఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి మాట్లాడుతూ నేటి యువత మొబైల్ లకు ఎక్కువగా అలవాటు పడి ఇంటి నుండి బయటకు రావడం లేదని బహిరంగ మైదానాల క్రీడలకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
యువత క్రీడల్లో రాణించాలని క్రీడల వలన యువతకు ఆరోగ్యం తో పాటు మానసిక వికాసం జరుగుతుందని చెప్పారు. మంచి వసతులతో క్రీడలను విజయవంతంగా నిర్వహించిన ఎంపిడిఓ లాజర్, పెద్ద కాపర్తి సర్పంచ్ మర్రి జలంధర్ రెడ్డి లను ఆయన అభినందించారు. అనంతరం ఎంపీపీ కొలను సునీత వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ యువతలో క్రీడల పట్ల ఆసక్తిని పెంచటానికి ప్రతి గ్రామం లో క్రీడ మైదానాల ఏర్పాటు చేస్తుందనీ తెలిపారు. క్రీడాకారులను అభినందిస్తూ గెలుపు ఓటములు జీవితంలో అనేక విషయాలను బోధిస్తాయనీ, నేటి యువత రేపటి భవిష్యత్ అని తెలియజేశారు. ఈ క్రీడ పోటీలలో పలు గ్రామాల జట్టులు పాల్గొనగా వాలీబాల్ మరియు కబడ్డీ పోటీలలో వెలిమినేడు జట్టు మొదటి స్థానంలో, ఖోఖో ఆటలో పెడ్డకాపర్తి టీమ్ మొదటి స్థానం లో నిలిచాయి. ఇక్కడ గెలుపొందిన టీం లను జిల్లా స్థాయి అదే విధంగా రాష్ట్రస్థాయి పోటీలకు పంపించడం జరుగుతుందనీ పిఈటి లు రవీందర్, బ్రహ్మయ్య లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ లాజర్, మున్సిపల్ కమిషనర్ రామదుర్గా రెడ్డి, మండల పంచాయితీ అధికారి పద్మ, పెద్ధకాపర్తి సర్పంచ్ మర్రి జలంధర్ రెడ్డి, ఆరెగూడెం సర్పంచ్ ఆరూరి లాలమ్మ స్వామి, ఎంపీటీసీ నీత రమణా రెడ్డి, వార్డ్ మెంబర్ తెల్సురి లింగయ్య, పలు గ్రామాల పంచాయితీ కార్యదర్శులు, పిఈటీలు, యువతీ యువకులు, క్రీడా కారులు పాల్గొన్నారు.