గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు మండల ప్రాథమిక పాఠశాలలో రూ. 150.00 లక్షలు( ఒక కోటి యాబై లక్షల) రూపాయల తో చేపట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ *
సాక్షిత : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన బస్తీ – మన బడి కార్యక్రమంలో భాగంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు మండల ప్రాథమిక పాఠశాలలో రూ. 150.00 ఒక కోటి యాబై లక్షల రూపాయల తో చేపట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణం పనులకు మండల విద్యాధికారి వెంకటయ్య , కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి , మాజీ కార్పొరేటర్ సాయిబాబా తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ రాయదుర్గం ప్రభుత్వ పాఠశాల లో మౌళికవసతుల కల్పనలో భాగంగా అదనపు తరగతి గదులను ప్రారంభించుకొవడం చాలా సంతోషకరమైన విషయం అని, తరగతి గదుల నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, నాణ్యత ప్రమాణాల తో చేపట్టాలని,నాణ్యత విషయంలో ఎక్కడ రాజీపడకూడదని, త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులో తీసుకురావాలని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు. అదేవిధంగా మన బస్తీ – మన బడి కార్యక్రమం మొదటి విడతలో పనులు పూర్తయిన పాఠశాలలు ఫిబ్రవరి 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం చేయడం జరిగిన విషయం విదితమే నని, దశల వారిగా అన్ని పాఠశాలలు అభివృద్ధి చేయడం జరుగుతుంది అని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయి అని నిన్న, మొన్నటి దాకా శిథిలావస్థలో కునారిల్లిన పాఠశాలలు సైతం నేడు అధునాతన సకల హంగులతో, కొత్త సొగసును సంతరించుకుంటున్నాయి. చూడముచ్చటైన తరగతి గదులు…. క్లాస్‌రూంలో డ్యూయల్ డెస్క్‌లు.. విద్యుత్తు వెలుగులు.. పరిశుభ్రమైన టాయిలెట్లు.. స్వచ్ఛమైన మంచినీళ్ల ట్యాంక్‌లు.. వంటగదులు.. భోజనశాలలు.. వాకింగ్ ట్రాక్‌లు.. చుట్టూ ప్రహరీలు.. ఇలా అనేక సకల సదుపాయాలతో విద్యార్థులు ఏకాగ్రతతతో నిశ్చింతగా చదువులు కొనసాగించేందుకు అవసరమైన ఆహ్లాదకర వాతావారణాన్ని పంచిపెడుతున్నాయి.
పిల్లల చదువులకు సరికొత్త భరోసాను అందిస్తున్నాయి. నేడు ప్రభుత్వ పాఠశాలు అసలు సిసలు సరస్వతీ నిలయాలుగా రూపుదిద్దుకుంటున్నాయి అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలలను అన్ని రకాల వసతుల తో ప్రయివేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దే క్రమంలో మన ఊరు మన బడి కార్యక్రమం చేపట్టడం చాలా గొప్ప విషయం అని ప్రభుత్వ గాంధీ పేర్కొన్నారు .ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల మౌలిక వసతులు కలిపించడమే ధ్యేయం అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా మన ఊరు మన బడి మొదటి విడతలో శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి శేరిలింగంపల్లి మండలం పరిధిలో 24 మరియు కూకట్పల్లి మండలం పరిధిలో 7 మొత్తము 31 ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కలిపించడం జరిగినదిఅని, మిగతా పాఠశాలలను దశల వారిగా పూర్తి చేసి శేరిలింగంపల్లి ని ఆదర్శవంతమైన నియోజకవర్గం గా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ పేర్కొన్నారు.
శంకుస్థాపన చేసిన కార్యక్రమాల వివరాలు:
- గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ. 104.00 లక్షల రూపాయల తో చేపట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణం పనులు
- గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం లో గల మండల ప్రాథమిక పాఠశాలలో రూ. 46.00 లక్షల రూపాయల తో చేపట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణం పనులు
పైన పేర్కొన్న పనులకు శంకుస్థాపన చేయడం జరిగినది అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో TSEWIDC AE శ్యామ్ , పాఠశాల ప్రధానోపాధ్యాయులు తాజ్ బాబు , గచ్చిబౌలి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజు నాయక్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెన్నం రాజు, సత్యనారాయణ, సంపత్,రమేష్, సతీష్, యాదగిరి, సల్లావుద్దీన్,అక్బర్, అంజమ్మ, సుధీర్,కాదర్ ఖాన్, మసూద్ అలీ,సుగుణ,బాలమణి, రాధ, మరియు విద్య కమిటీ ప్రతినిధులు కృష్ణ గౌడ్, సురేష్, నరేందర్, దేవేందర్, నరేందర్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.