632 ఓట్లతో వై.యస్.ఆర్.సి.పి విజయం
రిటర్నింగ్ అధికారి యం.నవీన్
స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుల ఓట్ల లెక్కింపు ప్రక్రియ శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో గురువారం ప్రశాంతంగా ముగిసింది.
జిల్లాలో పట్టభద్రుల శాసనమండలి సభ్యుల ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుల ఎన్నికలు ఈ నెల 13న జరిగిన సంగతి విదితమే. స్థానిక సంస్థలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 776 ఓటర్లకు గాను శ్రీకాకుళం రెవిన్యూ డివిజనులో 233 మంది,పాలకొండలో 149 మంది, టెక్కలిలో 161 మంది, పలాస రెవిన్యూ డివిజనులో 209 మంది వెరశి 752 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఓట్ల లెక్కింపు కావడంతో పౌర సరఫరాల కమీషనర్,ఎన్నికల పరిశీలకులు హనుమంతు అరుణ్ కుమార్,జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్రీకేశ్ లాఠకర్, సంయుక్త కలెక్టర్, రిటర్నింగ్ అధికారి యం.ఇందులో వై.యస్.ఆర్.సి.పి అభ్యర్ధి నర్తు రామారావుకు 632 ఓట్లు,స్వతంత్ర అభ్యర్ధి ఆనెపు రామకృష్ణకు 108 ఓట్లు, చెల్లని ఓట్లు12 వచ్చినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.దీంతో వై.యస్.ఆర్.సి.పి అభ్యర్ధి నర్తు రామారావు విజయం సాధించినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటిస్తూ ఎం.ఎల్.సి అభ్యర్ధిగా ఫారంను అందజేసారు.