SAKSHITHA NEWS

MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపిన దొంతిమాల చంద్రశేఖర్, బొల్లా మేరికూమారి ..

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బొల్లా మేరీకుమారి, ఎన్.టి.ఆర్. జిల్లా సెక్రెటరీగా దొంతిమాల చంద్రశేఖర్ నియామకం ..

నందిగామ పట్టణంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ని ఎన్.టి.ఆర్. జిల్లా పార్టీ ఎస్సీ సెల్ సెక్రటరీగా నియమితులైన దొంతిమాల చంద్రశేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన బొల్లా మేరీ కుమారి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి.. తమ నియామకానికి కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.. అనంతరం ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ వారిని శాలువాలతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు ..

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన మేలును.. క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరిస్తూ.. మరోసారి జగనన్న ను ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేయాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు ..

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు ..


SAKSHITHA NEWS