నిరుద్యోగుల పక్షాన పోరాటానికి పిలుపునిస్తే హౌజ్ అరెస్ట్ లు చేయాలని చూస్తారా ?
వేలాదిగా తరలి వస్తున్న పార్టీ శ్రేణులను ఎందుకు ఆపుతున్నారు ?
ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు మాకు లేదా ?
నేను ఒక మహిళనై ఉండి హౌజ్ అరెస్ట్ కాకుండా ఉండేందుకు,
పోలీసులను తప్పించుకొని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో..
గడపవలసిన పరిస్థితి రావడం మీకు అవమానం కాదా ?
మేము తీవ్రవాదులమా..లేక సంఘ విద్రోహ శక్తులమా?
మమ్మల్ని ఆపాలని చూస్తున్నారు అంటే…
మాకు భయపడుతున్నట్లే కదా అర్థం.
మీ అసమర్థతను కప్పి పుచ్చాలని చూస్తున్నట్లే కదా అసలు వాస్తవం.
మమ్మల్ని ఆపాలని చూసినా,ఎక్కడికక్కడ మా కార్యకర్తలను నిలువరించినా,
బారికెడ్లతో బందించాలని చూసినా,నిరుద్యోగుల పక్షాన పోరాటం ఆపేది లేదు.