వై.యస్. అర్ . కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం 14 వసంతాలు

Spread the love

సాక్షిత : రాష్ట్రంలో ఫ్యాన్ గుర్తు రాగానే మూడో వ్యక్తిగా పోటీ చేసిన వ్యక్తి నేనే

ఎమ్మెల్యే ప్రసన్న

మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టాభిషేకం చేసుకోబోతున్నాడు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14 వసంతాలు అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కోవూరు మండలం ఇనమడుగు గ్రామంలో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కేక్ కటింగ్ చేసి సంబరాలు నిర్వహించి మూడు రంగుల మన జెండా పేదోడు భవిష్యత్తు మార్చడానికి తమ గుండె గా మార్చుకున్న ప్రతి కార్యకర్తకు నాయకులకు అభిమానులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం వారు మాట్లాడుతూ గడిచిన ఈ 13 ఏళ్లలో ఎన్నో సవాలను అధిగమించ సంపూర్ణ ప్రజాబలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది

ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలు కూడా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయడం జరిగింది అన్నిటికీ మించి రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో మనందరికీ తెలుసు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ జగన్మోహన్ రెడ్డికి ఆంక్షలు విధించడం ఓదార్పు యాత్ర చేసేదానికి లేదని చెప్పడం ప్రజల్లోకి వెళ్లేందుకు లేదని చెప్పడం ఒక్కసారి విజయమ్మ తో కలిసి బయటకు వచ్చిన విషయం మీ అందరికీ తెలుసు పేద ప్రజల కోసం పార్టీని స్థాపించి ఎవరైతే రాజశేఖర్ రెడ్డి కోసం ప్రాణాలు అర్పించారు వాళ్ళందరినీ ఆదరించాలని ఓదార్పు యాత్ర చేసిన సంగతి మీ అందరికీ తెలుసు ఉప ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి విజయమ్మ భారీ మెజార్టీతో గెలిచారు ఆ రెండు ఉప ఎన్నికల తర్వాత 2012 ఉప ఎన్నికలు కోవూరు వచ్చింది మూడో వ్యక్తిగా ఫ్యాన్ గుర్తు నాకు రావడం నేను పోటీ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను రాష్ట్రంలో నేనే మూడో వ్యక్తిని ఫ్యాన్ గుర్తు మీద పోటీ చేసి గెలిచిన వ్యక్తిని రాష్ట్రాన్ని ఆదర్శ రాష్ట్రంగా చేస్తున్న మన ముఖ్యమంత్రి ఎవరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, చేసిన అన్ని పార్టీలు కలిసి వచ్చిన మన జగన్ మోహన్ రెడ్డిని ఏమి చేయలేరు, జరగబోయే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతోంది మళ్లీ ముఖ్యమంత్రిగా వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పట్టాభిషేకం చేసుకోబోతున్నారని తెలియజేశారు..ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ సలహా మండల చైర్మన్ దొడ్డం రెడ్డి నిరంజన్ బాబు రెడ్డి, ఏఎంసి చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు నలుబోలు సుబ్బారెడ్డి, జడ్పిటిసి కవరగిరి శ్రీలత, ఎంపీపీ పార్వతి, వైస్ ఎంపీపీ శివుని నరసింహులు రెడ్డి, వ్యవసాయ మండల చైర్మన్ హరి ప్రసాద్ రెడ్డి, వసంత్ రెడ్డి, సొసైటీ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి, మండల కోశాధికారి మావులూరు వెంకటరమణారెడ్డి, డి ఎల్ డి ఏ డైరెక్టర్ కాటన్ రెడ్డి దినేష్ రెడ్డి, జలజీవన్ మిషన్ చైర్మన్ గోపిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైసీపీ జిల్లా యువజన కార్యదర్శి సాయి యశ్వంత్ రెడ్డి, కో- ఆప్షన్స్ సభ్యులు జుబేర్ భాష, సర్పంచులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు..

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

Related Posts

You cannot copy content of this page