SAKSHITHA NEWS

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి..

మత్తు పదార్థాలకు దూరంగా ఉండి తల్లిదండ్రులు కన్న కలలను సాకారం చేయాలి…..

జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్..

అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలో ర్యాలీ..

యువత మత్తు పదార్థాలకు లోనవ్వకుండా దూరంగా ఉండాలని ఆదిశగా అనుబంధ శాఖల అధికారులు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు

బుధవారం అంతర్జాతీయ మాదకద్రవ్యాలు అక్రమ రవాణా, వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని మహిళ శిశు సంక్షేమ, వయోవృద్ధులు దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద నుండి సద్దల చెరువు ట్యాంక్ బ్యాండ్ వరకు నిర్వహించిన ర్యాలీలో జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ జెండా ఊపి ప్రారంభించారు.

అనంతరం కొత్త బస్టాండ్ నుంచి గాంధీ బొమ్మ , ఎంజీ రోడ్డు, సద్దలచెరువు వరకు మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ
అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం -2024 సందర్బంగా జిల్లాలో మహిళ,శిశు,వికలాంగులు, వయోవృద్ధులు , ట్రాన్స్ జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ అలాగే జిల్లా పోలీస్ శాఖ ,జిల్లా ఎక్సైజ్ శాఖల యాంటి నార్కోటిక్స్ బ్యూరో, వారి ఆధ్వర్యంలో జిల్లాలోని విద్యార్థులు, యువతకు అవగాహన కల్పించాలని అన్నారు.

ర్యాలీలో భాగంగా
విద్యార్థులకు,యువత కు మాదక ద్రవ్యాల దుర్వినియోగం అలాగే అక్రమ రవాణా పై అవగాహన కల్పించారు.


మినీ ట్యాంక్ బండ్ దగ్గర ఏర్పాటు చేసిన కార్యక్రమం లో విద్యార్ధుల తో కార్యక్రమం లో పాల్గొన అందరితో డ్రగ్స్ రహిత సమాజం లో వారు భాగం అయేలా వారితో ప్రతిజ్ఞ చేయించారు.

విద్యార్థులకు మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా పై అవగాహన కల్పించారు డ్రగ్స్ అక్రమ రవాణా చేసేవారు, వాటిని ఉపయోగించే వారి వివరాలు పోలీస్ శాఖ కి తెలపాలని అన్నారు.

కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ డ్రగ్స్ ప్రోగ్రాం మిషన్ పరివర్తన పోస్టర్స్ ను అవిష్కరించారు.

ఈ కార్యక్రమం లో Adlsp యం.నాగేశ్వరావు, DSP రవి కుమార్, డి.యం & హెచ్ ఓ కోట చలం,డిఐఈవో కృష్ణయ్య, డ్రగ్ ఇన్స్పెక్టర్, ఎక్సైజ్ జిల్లా ఆఫీసర్ లక్ష్మ నాయక్ ,డి.పి.ఆర్.వో రమేష్ కుమార్ , జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ , కళాశాల విద్యార్ధులు ,,జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయ సిబ్బంది, కళాశాల ప్రొఫెసర్ లు,అధ్యాపకులు పాల్గొన్నారు.

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి..

SAKSHITHA NEWS