ఇండియా కూటమికి దగ్గరగా వైసీపీ… మరో అడుగు !
లోక్ సభలో విపక్ష కూటమికి వైపీసీ దగ్గరవుతోందని కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. జగన్ కూడా ఇండియా కూటమిలో భాగస్వామి అవుతారన్న ప్రచారానికి, జగన్ ఇటీవల ఢిల్లీలో చేసిన ధర్నా సందర్భంగా జరిగిన పరిణామాలు బలం చేకూర్చాయి. ఇండియా కూటమిలో కీలకంగా ఉన్న సమాజ్ వాదీ పార్టీ, ఉద్దవ్ థాక్రే శివసేన నుండి సంజయ్ రౌత్ వచ్చి జగన్ కు మద్దతిచ్చారు.
అప్పటి నుండే జగన్ ఇండియా కూటమికి దగ్గరవుతున్నారా అన్న చర్చ జరిగింది. టీడీపీ ఎన్డీయేలో చేరిన నేపథ్యంలో… గత ఐదు సంవత్సరాలుగా బీజేపీకి సపోర్ట్ చేస్తూ వస్తున్న వైసీపీ దూరంగా ఉంటుందని అందరూ భావించారు. అయితే, రాజ్యసభలో 11మంది ఎంపీలున్న వైసీపీ అవసరం ఎన్డీయేకు ఉందని… వైసీపీని దూరం పెట్టకపోవచ్చన్న చర్చ సాగింది. కానీ, ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న చంద్రబాబు వైసీపీని దగ్గరకు రానివ్వరని జగన్ కు కూడా తెలుసు. ఇటు బీజేపీ కూడా వైసీపీని సీరియస్ గా తీసుకున్నట్లు కనపడటం లేదు. దీంతో, జగన్ డైరెక్టుగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో మాట్లాడలేరన్న ఉద్దేశంతోనే మధ్యవర్తిగా అఖిలేష్ యాదవ్ వచ్చారన్న ప్రచారం ఢిల్లీ వర్గాల్లో జోరుగా సాగింది.
ఈ ఊగిసలాట కొనసాగుతున్న తరుణంలో లోక్ సభలో కేంద్రం తెచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు ఇండియా కూటమితో వైసీపీ జతకట్టింది. బిల్లును వైసీపీ వ్యతిరేకిస్తుందని ఎంపీ మిథున్ రెడ్డి ప్రకటించారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే బిల్లును పార్లమెంట్ ముందుకు పంపాలన్న ఇండియా కూటమి వాదనతో వైసీపీ జతకట్టింది. దీంతో వైసీపీ… ఇండియా కూటమికి దగ్గరయ్యేందుక మరో అడుగు పడిందన్న అభిప్రాయాలు వ్యక్తం