SAKSHITHA NEWS

జిజియూలో ముగిసిన వర్క్ షాప్
రాజానగరం, సాక్షిత:
అఖిలభారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసిటిఈ) వాణి పథకం కింద గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం లోని గైట్ అటానమస్ కళాశాలలో పెట్రోలియం ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఏఐసిటిఈ సౌజన్యంతో గత రెండు రోజులుగా జరుగుతున్న వర్క్ షాప్ శుక్రవారంతో ముగిసింది. విద్యుత్ వాహనాల వేస్ట్ బ్యాటరీ నుంచి పర్యావరణం పై పడుతున్న ఇటీవల పరిణామాలు అనే అంశంపై ఈ వర్క్ షాప్ ను నిర్వహించారు. విజయవాడలోని ఫిక్కీ ఎనర్జీ మేనేజర్ మెహర్అలీ అహ్మద్ పాల్గొని మాట్లాడుతూ బ్యాటరీల వల్ల పర్యావరణానికి జరిగే నష్టాన్ని తెలిపారు. ఎనర్జీ సెక్టార్లో విద్యార్థులకు గల ఉద్యోగ అవకాశాలను వివరించారు. అలాగే ధన్బాద్ లోని ఐఐటి…ఐఎస్ఎమ్ నుంచి, వెల్లూరులోని విఐటి నుంచి ప్రముఖులు హాజరై వివిధ అంశాలపై ప్రసంగించారు. ముగింపు సభలో పాల్గొన్న గైట్ అటానమస్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.జయానందకుమార్ మాట్లాడుతూ సహజ వనరులను సక్రమంగా వినియోగించుకుంటూ భవిష్యత్ తరాలకు వాటిని అందించవలసిన బాధ్యత మన అందరిపై ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెట్రోలియం ఇంజనీరింగ్ విభాగాధిపతి ఎండి . మహమ్మద్ షరీఫ్, సివో, కార్డినేటర్
డాక్టర్ ఎన్విఆర్ నాగలక్ష్మి, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ వి. సుబ్రహ్మణ్యం తదిరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS