కార్మికుల గౌరవ వేతనం పెంచాలి
-పర్యటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్
రాజమహేంద్రవరం, :
ఆంధ్రా పేపర్ లిమిటెడ్, రాజమహేంద్రవరంలో పెండింగ్‌లో ఉన్న కార్మికుల, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయానికి తగిన ప్రతిపాదన పంపడం జరుగుతుందని రాష్ట్ర పర్యటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి లు పేర్కొన్నారు. సాయంత్రం కలెక్టరేట్లో పేపర్ యూనియన్ యాజమాన్యాల 10 యూనియన్ల ప్రతినిధులు ఆంధ్ర పేపర్ మిల్ యాజమాన్యం ప్రజాప్రతినిధులు అధికారుల సమక్షంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి , ఎస్పి నరసింహ కిషోర్ లు సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో మంత్రి కన్నీరు దుర్గేష్ కందుల దుర్గేష్, ఎంపీ పురందరేశ్వరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, అధికారులు , పది యూనియన్ లకి చెందిన నాయకులు, కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ లేబర్ ఏ రాణి, డిసీఏల్ కే. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందులు దుర్గేష్ మాట్లాడుతూ, పేపర్ మిల్ యూనియన్ నాయకులతోనూ కంపెనీ యాజమాన్యం తోనూ విస్తృత చర్చల అనంతరం గౌరవ వేతనం పెంచాలని కార్మికులు ప్రతిపాదించిన ప్రతిపాదనను పరిగణన లోనికి తీసుకొవాలని స్పష్టం చేశామన్నారు. తదుపరి బోర్డు సమావేశంలో తమ డైరెక్టర్ల బోర్డుకు వివరించి ఆమేరకు ముందుకు రావడం జరుగుతుందని పేర్కొన్నారు. సమస్యలు లేని ఏపిపిఏంబిల్డింగ్ కో-ఆపరేటివ్ సొసైటీ, 2. ఎపిపి ఎం మల్టీపర్పస్ ఉద్యోగుల కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ల కార్యకలాపాలు కొనసాగించాలన్న కార్మికుల డిమాండు సానుకూలంగా స్పందించాలని ఎంపి దగ్గుబాటి పురందరేశ్వరి సూచించారు.
ఈ సందర్భంగా ఇరువురికి ఆమోదయోగ్యమైన ప్రతిపాదనలను కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ పి ప్రశాంతి ప్రతిపాదించడం జరిగింది. ఈ నేపధ్యంలో 01.07.2020 నుండి 31.12.2023 వరకు వేతన పెంపుదల గురించి మంచి ప్రతిపాదనతో రావాలని మేనేజ్‌మెంట్ ప్రతినిధులకు సూచించారు.