SAKSHITHA NEWS

సూర్యాపేటలో ఘనంగా మహిళ దినోత్సవం

సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి : సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ పెరుమాల్ల యాదయ్య అధ్యక్షతన మహిళ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల మహిళ అధ్యాపకురాలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ మహిళా లోకానికి తొలి బడిని స్థాపించి విద్యను అందించిన భారతదేశ తొలి మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వి.డి ఎస్ ప్రసాద్ , వాసు, గురవయ్య, సైదులు, నిరంజన్ రెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ చీకురి కృష్ణ ,గోరంట్ల నవీన్, సన్మాన గ్రహీత అధ్యాపకురాల్లు,అధ్యాపకులు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS