
ఆర్య వైశ్య ఆఫీషల్స్ & ప్రొఫెషనల్స్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలో ముఖ్య అతిధులుగా పాల్గొన నిజాంబాద్ ఎమ్మెల్యే శ్రీ ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, నిజాంపేట్ మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్
ఈరోజు నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంబాద్ ఎమ్మెల్యే శ్రీ ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, నిజాంపేట్ మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారు, కల్వకుర్తి సీనియర్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉప్పాల వెంకటేష్ గార్లుముఖ్య అతిధులుగా నిజాంపేట్ సప్తపది ఫంక్షన్ హాల్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆర్య వైశ్య ఆఫీషల్స్ & ప్రొఫెషనల్స్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో,ఆర్య వైశ్య ఆఫీషల్స్ & ప్రొఫెషనల్స్ స్టేట్ ప్రెసిడెంట్ శిల్ప వందనపు, ప్రెసిడెంట్ శంకర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కట్ట రవి, మేడ్చల్ జిల్లా వైశ్య మహిళా విభాగం ప్రెసిడెంట్ కవిత ,ఐవిఎఫ్ ప్రెసిడెంట్ నవీన్ కుమార్, స్టేట్ కమిటీ సభ్యులు, ఆర్య వైశ్య ఆఫీషల్స్ & ప్రొఫెషనల్స్ సభ్యలు సౌమ్య, మౌనిక, సురేష్, వినయ్,మహిళలు తదితరులు పాల్గొన్నారు..
