పేద ప్రజలకు అండ వైస్సార్సీపీ జెండా..
నరసరావుపేట పట్టణంలోని 11వ వార్డులోని 14.60 కోట్ల రూపాయలతో సంక్షేమం, అభివృద్ధి చెయ్యగా, 1.08 కోట్ల రూపాయలతో వార్డులోని మరమ్మత్తులు పనులు చేశాం..
13వ వార్డులోని 9.45 కోట్ల రూపాయలతో సంక్షేమం, అభివృద్ధి చెయ్యగా 34.40 లక్షల రూపాయలతో వార్డులోని మరమ్మత్తులు పనులు చేశాం..
పట్టణంలోని ప్రకాష్ నగర్ లో 11 & 13 వ వార్డులు వై ఏ.పీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ..
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు వైస్సార్సీపీ జెండా అండగా ఉందని ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారని నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నరసరావుపేట పట్టణంలోని 11 & 13వ వార్డు అనగా ప్రకాష్ నగర్ లో “వై ఏపీ నీడ్స్ జగన్” కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు అనంతరం స్థానిక వార్డు నాయకులతో కలిసి వార్డు అభివృద్ధి డిస్ప్లే బోర్డును ఆవిష్కరించి అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డా౹౹గోపిరెడ్డి మాట్లాడుతూ ఈ వార్డులోని 60Ft రోడ్డు, రిక్షా సెంటర్, రిజిస్టర్ ఆఫీస్, ఆంధ్ర బ్యాంక్, పోస్ట్ ఆఫీస్, స్వామి స్కూల్ ఎదురు, బ్లైండ్ స్కూల్, డీఎస్పీ బంగ్లా పరిసర ప్రాంతాల పరిధిలో 24.05 కోట్ల రూపాయలతో సంక్షేమం అభివృద్ధి చేసాం అని తెలిపారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి నేటి వరకు కుల, మత పార్టీలు చూడకుండా ప్రతి ఇంట సంక్షేమ పథకాలను అందించారని చెప్పారు. జగన్ ముఖ్యమంత్రిగా కొనసాగితేనే సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, వార్డు ఇన్చార్జిలు, పెద్ద ఎత్తున వార్డు మహిళలు, సచివాలయ సిబ్బంది, వాలెంటీర్లు, సచివాలయ కన్వినర్ లు, సచివాలయ గృహసారధులు తదితరులు పాల్గొన్నారు…