సైబర్ ముఠాల భరతము పట్టేదెవరు ??
13-02-2024 (మంగళవారం) ఈనాడు ఎడిటోరియల్ లో …,
99 శాతము సైబర్ నేరాలు బాధితుడి సహకారముతో జరుగుతాయి ,,
కావున ఎక్కడ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి , ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ??
సైబర్ నేరాలు జరగడానికి గల కారణాలు అవే అత్యాశ , అమాయకత్వం , కామము , భయము గురించి ప్రస్తావించకపోవడం బాధాకరం..!!
సమాజంలో ప్రజలు సంస్థలలో , విద్యాలయాలలో , గ్రామాలలో / పట్టణాలలో ఎక్కడో ఒక్కచోట పని చేస్తూ / చదువుకుంటూ జీవిస్తుంటున్నారు ..,
ప్రతి గ్రామము , పట్టణము , సంస్థ , విద్యాలయాలలో ఉన్నత స్థానములో వున్నవాళ్లు మేలుకుంటే సరి లేకపోతే ఇంతకు వందరెట్లు నష్టం జరుగుతుంది ..!!
గత 10 సంవత్సరాలుగా CISF , DRDL, Hetero , BSNL , పోలీస్ , బ్యాంకు , ఐఐటీ ,విశ్వవిద్యాలయాలు , కళాశాలలు , పాఠశాలలో సైబర్ నేరాల నివారణ పై అవగాహన సదస్సులు నిర్వహించిన నిర్వహిస్తున్న అనుభవం తో చెప్తున్నాను .., వ్యక్తిగతంగా మనకు మనము కాపాడుకోవడము తప్పితే వేరే మార్గము లేదు ..,
అది సైబర్ నేరాలపై సరియిన అవగాహన ద్వారా మాత్రమే వీలవుతుంది ..!!
ఇంతకీ సైబర్ ముఠాల భరతము పట్టేదెవరు ??