కాంట్రాక్ట్ ఉద్యోగులను ఎప్పుడు క్రమబద్దీకరణ చేస్తారు?
జిల్లా నేత జయప్రకాష్ డిమాండ్
తెలంగాణ రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను ఎప్పుడు క్రమబద్దీకరణ చేస్తారు అని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ జోగులాంబ గద్వాల్ జిల్లా ప్రెసిడెంట్ జయప్రకాష్ రాష్ట్ర ప్రభుత్వం ను సూటిగా ప్రశ్నించారు. గత 20 సంవత్సరకాలంగా చాలీచాలని జీతాలతో కుటుంబము ను పోషించుకొలేక , ఆర్థిక ఇబ్బందులతో అప్పులు చేసి కొని ఉద్యోగాలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. రెగ్యులర్ ఉద్యోగులతో పాటుగా సమానంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ విధులను సక్రమంగా నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు.సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీమ్ కోర్టు చెప్పిన దానిని అమలు చేయడం లేదని ఆయన అన్నారు. రెగ్యులర్, కాంట్రాక్ట్ ఉద్యోగులు చేసేది ఒకే పని అయినప్పుడు వేతనాలు ఇవ్వడములో తారతమ్యం ఎందుకు చూపుతున్నారని ఆయన మాట్లాడుతూ తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు అన్నీ జాతీయ, రాష్ట్ర ప్రభుత్వం పెట్టే ప్రోగ్రామ్ లలో పాల్గొని పనిచేస్తున్నారని ఆయన అన్నారు. వ్యాధి నిరోధక టీకాలు, క్షయ వ్యాధి నిర్మూలన, కుష్ఠు వ్యాధి నిర్మూలన, కుటుంబ నియంత్రణ, ఫ్రై డే డ్రై డే ప్రోగ్రామ్, నులిపురుగులు నివారణ,బోదకాలు వ్యాది నిర్మూలన తదితర అన్నీ రకాల కార్యక్రమం లో కాంట్రాక్ట్ ఉద్యోగులు చురుగ్గా పాల్గొని పనిచేస్తున్నారని ఆయన అన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులజీవితాలతో చెలగాటం ఆడుతున్నారు అని ఆయన విమర్శించారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల శ్రమ దోపిడి ని. అరికట్టలని ఆయన అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె సి ఆర్ అసెంబ్లీ లో కాంట్రాక్ట్ ఉద్యోగులు ను పర్మినెంట్ చేస్తామని ప్రకటన చేశారని ఆయన గుర్తు చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు క్రమబద్దీకరణ లో జాప్యం ఎందుకు జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తారని వెయ్యి కళ్లతో అందరూ ఎదురు చూస్తున్నారు అని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె సి ఆర్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు గారలు కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా నేత జయప్రకాష్ డిమాండ్ చేశారు