Welfare Schemes for Eligible
అర్హులకు సంక్షేమ పధకాలు.. దళారీ వ్యవ్యస్థ నివారణకు చర్యలు .. ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్
సాక్షిత సికింద్రాబాద్ : మెట్టుగూడ, బౌద్దనగర్ మునిసిపల్ డివిజనల పరిధులలో బుధవారం ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ ఇంటింటికీ తిరుగుతూ లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి,శాదిముబరాక్, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించారు. మెట్టుగూడ కార్పొరేటర్ శ్రీమతి రాసురి సునీత, బౌద్దనగర్ కార్పొరేటర్ శ్రీమతి కంది శైలజ, తెరాస యువ నేత తీగుల్ల కిరణ్ కుమార్ లతో పాటు నేతలు అధికారులతో కలిసి రూ. 42 లక్షల విలువ చేసే 47 చెక్కులను పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా అందచేశారు.
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ పేద ప్రజలకు వరంగా నిలిచీలా వివిధ సంక్షేమ పధకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు జరుపుతోందని తెలిపారు. విజయపురి కాలని, హమాలి బస్తి, మెట్టుగూడ, పోస్ట్ ఆఫీస్ గల్లి, దూద్ బావి, సంజయ్ గాంధీ నగర్, అంబర్ నగర్, ఈశ్వరి బాయి నగర్, పార్శీ గుట్ట, అశోక నగర్, బౌద్దనగర్, పుల్లయ్య బావి, మధురా నగర్ తదితర ప్రాంతాల్లో పద్మారావు గౌడ్ పాద యాత్ర సాగింది.
కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు
సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం లో కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులను చేపడుతూ దశాబ్దాల అపరిష్కృత సమస్యలను పరిష్కరిస్తున్నామని ఉప సభాపతి పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా తెలిపారు. బౌద్దనగర్ డివిజన్ పరిధిలో రూ.1.50 కోట్ల ఖర్చుతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను స్థానిక కార్పొరేటర్ శ్రీమతి కంది శైలజ, అధికారులు, నేతలతో కలిసి ప్రారంభించారు.
సంజయ్ గాంధి నగర్ లో రూ.35 లక్షల ఖర్చుతో సివరేజి లైన్ల నిర్మాణం, అంబర్ నగర్ ఏకశీలా మెడికల్ హాల్ వద్ద రూ.95 లక్షల ఖర్చుతో నాలా పై స్లాబ్ నిర్మాణం, అంబర్ నగర్ చిల్లా వద్ద రూ.29 లక్షల ఖర్చుతో సివరేజ్ లైన్ ఏర్పాటు పనులు, బౌద్ద నగర్ లో రూ.22 లక్షల ఖర్చుతో సీ సీ రోడ్డు నిర్మాణం, ఈశ్వరి బాయి నగర్ లో 12 లక్షల ఖర్చుతో సివరేజ్ లైన్ నిర్మాణం పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా వివిధ సదుపాయాలు కల్పిస్తున్నామని, ప్రభుత్వ నుంచి అదనంగా నిధులను సమకుర్చుకున్తున్నామని తెలిపారు. అధికార యంత్రాంగం ప్రజా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని అయన ఆదేశించారు. జల మండలి జనరల్ మేనేజర్ రమణారెడ్డి, జీ హెచ్ ఏం సీ ఈ ఈ శ్రీమతి ఆశలత్, తెరాస యువ నేత కిరణ్ కుమార్, నేతలు, అధికారులు పాల్గొన్నారు.