పోలీసు సిబ్బంది యెుక్క సంక్షేమానికి ప్రాధాన్యత.
సిబ్బంది సమస్యల పరిష్కారానికి పోలీసు గ్రీవెన్స్ డే నిర్వహించిన జిల్లా ఎస్పి కె.వి.మహేశ్వర రెడ్డి ఐపీఎస్
శ్రీకాకుళం :
జిల్లా పోలీసు సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ వారి యొక్క సమస్యల పరిష్కారం కొరకు గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మహేశ్వర రెడ్డి, ఐపీఎస్ పోలీసు గ్రీవెన్స్ డే ను నిర్వహించారు. ఈ క్రమంలో జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లు, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు సిబ్బంది,ఇతర విభాగాలలో విధులు నిర్వర్తిస్తున్న 32 మంది పోలీసులు వారి యొక్క శాఖ పరమైన, ఉద్యోగరీత్యా, వ్యక్తిగత సమస్యల గురించి జిల్లా ఎస్పీ కు స్వయంగా విన్నవించుకున్నారు. పోలీసు సిబ్బంది బదిలీలు, సీనియారిటీ ప్రమోషన్స్, సరెండరు లీవ్స్ మంజూరు, ఇన్కమ్ టాక్స్ రికవరీ,ఆరోగ్య పరమైన సమస్యలు వంటి విషయాలు పై విన్నవించారు.
జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి వారి సమస్యలను కూలంకుషంగా విని, వారి సమస్యలకు తగిన పరిష్కారం చూపుతానని సిబ్బందికి భరోసా కల్పించారు.ఆయా ఫిర్యాదులపై సంబంధిత జిల్లా పోలీస్ కార్యాలయ(డిపివో) అధికారులతో జిల్లా ఎస్పీ మాట్లాడి, ఆ సమస్యలను త్వరితగతిన పరిష్కారించాలని ఆదేశించారు.
పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి జిల్లా ఎస్పీ శ్రీ కె.విమహేశ్వర రెడ్డి,ఐపీఎస్ చొరవ చూపడం, సత్వరమే చర్యలు చేపట్టడం పట్ల జిల్లా ఎస్పీ కి పోలీసు సిబ్బంది తమ ధన్యవాదాలు తెలియజేసారు.