SAKSHITHA NEWS
We will fight as a strong opposition: Rahul

బలమైన ప్రతిపక్షంగా పోరాడుతాం: రాహుల్

బలమైన ప్రతిపక్షంగా పోరాడుతాం: రాహుల్
పార్లమెంటులో బలమైన ప్రతిపక్షంగా పోరాడుతామని, జవాబుదారీతనం లేని BJP నేతృత్వంలోని NDA ప్రభుత్వాన్ని నిలదీస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. ఢిల్లీలో పార్లమెంట్ వద్ద సోమవారం మీడియాతో మాట్లాడారు. పశ్చిమ బెంగాల్ రైలు దుర్ఘటన, కాశ్మీర్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడులు, రైళ్లలో ప్రయాణికుల దుస్థితి, NEET స్కామ్, NEET పీజీ వాయిదా, UGC NET పేపర్ లీక్ వంటి అంశాలపై మోడీ సర్కారు జవాబు చెప్పాలన్నారు.